సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకోవా!
కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే ఏపీ నిర్ణయం?
ఆంధ్రప్రదేశ్ లో సెప్టెంబరు 5 నుంచి పాఠశాలు తెరిచి విద్యాబోధన ప్రారంభించాలని ఇంతవరకు రాష్ర్ట ప్రభుత్వం భావించినా ప్రస్తుతం ఆ అవకాశాలు లేవని సమాచారం. కేంద్ర ప్రభుత్వం శనివారం అన్ లాక్ మార్గదర్శకాలు 4.0 విడుదల చేసింది. వాటిలో సెప్టెంబరు నెలాఖరు వరకు పాఠశాలలు, కళాశాలలు, కోచింగు సెంటర్లు తెరిచేందుకు వీలు లేదని తేల్చి చెప్పింది. దీంతో ఆంధ్రప్రదేశ్ సెప్టెంబరు 5 నుంచి పాఠశాలలు ప్రారంభించాలన్న నిర్ణయానికి దాదాపు బ్రేక్ పడ్డట్టు అయింది.
కేంద్ర మార్గదర్శకాలకు భిన్నంగా రాష్ర్ట ప్రభుత్వం వ్యవహరించదు. వివిధ రాష్ర్టాల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాతే కేంద్రం తన నిర్ణయాన్ని వెలువరించింది. మరో వైపు ఇప్పటికే రాష్ర్టంలో కరోనా కేసులు 4.10 లక్షలు దాటాయి. మరో వైపు ఇప్పటికీ రోజుకు పది వేల కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పాఠశాలలు తెరవడమూ అంత మంచిది కాదు. రాష్ర్ట మంత్రి మండలి సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు రాగా కేంద్రం ఏం చెబుతుందో చూద్దామని ముఖ్యమంత్రి అన్నారు.నిజానికి సెప్టెంబరు 5 గడువు విధించడానికి కూడా నాడు-నేడు పనులు పూర్తి చేయాలనే ఉద్దేశమే అన్న అభిప్రాయమూ ఉంది. సెప్టెంబరు 5న పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని కార్యక్రమం తలపెట్టారు. అది కూడా ఎంత వరకు సాగుతుందనేది అనుమానమే. మరో రెండు మూడు రోజుల్లో పాఠశాలలు తెరవడానికి సంబంధించి విద్యాశాఖ కమిషనర్ మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. ప్రస్తుత విధానంలోనే పాఠశాలల నిర్వహణ కొనసాగనున్నది అని సమాచారం.

0 comments:
Post a comment