బదిలీల వైపు ఉపాధ్యాయుల చూపు....
🟥 షెడ్యూలు విడుదల ఎన్నడో.....
🟥 సెప్టెంబరు 5న బడుల పునఃప్రారంభం.....
💢 సెప్టెంబరు 5వ తేదీన పాఠశాలల పునః ప్రారంభం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదే సందర్భంలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఇప్పటికీ షెడ్యూలు విడుదల అవకపోవటం చర్చనీయాంశమైంది. షెడ్యూలు విడుదల, ఒత్తిడులకు తలొగ్గకుండా పారదర్శకంగా బదిలీలు జరుగుతాయా? ఎనిమిది సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించిన వారిని పట్టణ ప్రాంతాల్లో నియమిస్తారా.. తదితర ప్రశ్నలు ఉపాధ్యాయుల్లో ఉదయిస్తున్నాయి.
💢 రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వివిధ శాఖల్లో ఉద్యోగుల బదిలీలు చేపట్టారు. విద్యాశాఖలో ఉపాధ్యాయులకు మాత్రం నిర్వహించలేదు. కొద్ది సంవత్సరాలుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియే చేపట్టలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది సంవత్సరాలు, ఆపై సేవలందిస్తున్న వారు అక్కడి నుంచి స్థానచలనం కోసం ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్నారు.
💢 ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి గారు విద్యాశాఖపై సమీక్ష సమయంలో బదిలీలకు పచ్చజెండా ఊపారని, ఈ ఏడాది తప్పక చేపడతామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. దీంతో బదిలీల వైపు చూస్తున్న ఉపాధ్యాయులు ఆ ప్రక్రియ కోసం ఎదురు చూస్తున్నారు.
💢 ఇదే సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు ప్రభుత్వ స్థాయిలో తమ అనుకూల రాజకీయ, సంఘాల నాయకుల సిఫార్సులతో ఇష్టమైన స్థానానికి బదిలీలు చేయించుకుని ప్రభుత్వ ఉత్తర్వులు తెచ్చుకుంటుండటం ఆందోళన రేకెత్తించింది. ఈ అంశంపై వివిధ ఉపాధ్యాయ సంఘాలు సైతం నిరసనలు తెలియజేశాయి.
💢 దీంతో ఉపాధ్యాయుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు షెడ్యూలు విడుదల ఆలస్యమవుతుండటంతో బదిలీల నిర్వహణపైనే సందిగ్ధత నెలకొంది. మరోవైపు ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఈ ఏడాది నుంచి ఇద్దరు ఉపాధ్యాయులను తప్పనిసరిగా నియమించాలని ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది.
💢 ప్రభుత్వ నిర్ణయం కొంతమేర ఏకోపాధ్యాయ పాఠశాలల రూపురేఖల మార్పునకు కారణమవుతుందనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణ అనంతరం బదిలీలు చేపడతామని అధికారులు చెబుతున్నారు.
💢 ఆయా పాఠశాలల్లో ఇద్దరు ఉపాధ్యాయుల నియామకానికీ బదిలీల ప్రక్రియ చేపట్టటం అనివార్యమని పలువురు ఉపాధ్యాయులు, సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు.

0 comments:
Post a comment