"భారత్‌లో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతం"
India Outbreak Report: దేశాన్ని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతూనే ఉంది. అయితే ఇదే సమయంలో దేశవ్యాప్తంగా రికవరీ శాతం పెరగడం ప్రజలకు కాస్త ఊరటను ఇస్తోంది. ఇదిలా ఉంటే ఇండియాలో డిసెంబర్ 3 నాటికి కరోనా అంతమవుతుందని 'టైమ్స్ ఫ్యాక్ట్- ఇండియా ఔట్ బ్రేక్' రిపోర్ట్ అంచనా వేస్తోంది. తాజాగా కరోనా హాట్‌స్పాట్స్ అయిన ఢిల్లీ, ముంబై నగరాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో ఈ ఐఓఆర్ నివేదికకు ప్రాధ్యానత తెచ్చిపెట్టింది.
ఐఓఆర్ నివేదిక ప్రకారం.. దేశంలో సెప్టెంబర్ 2 నాటికి కరోనా కేసులు పీక్ స్టేజికి చేరుకునే అవకాశాలు ఉన్నాయంది.
అలాగే ఏపీలో ఈ నెల 23 నాటికి, తెలంగాణ ఆగష్టు 15 నాటికే కరోనా తీవ్రత పతాక స్థాయికి చేరుకుందని స్పష్టం చేసింది. ఇక నగరాల వారీగా వైరస్ తగ్గుముఖం పట్టేది ఎప్పుడో కూడా ఈ నివేదిక అంచనా వేసింది. నవంబర్ నాటికి ముంబైలో, అక్టోబర్ చివరికి చెన్నైలో, నవంబర్ ఫస్ట్ వీక్‌కు ఢిల్లీలో, అలాగే నవంబర్ మూడోవారానికి బెంగళూరులో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతుందని ఇండియా ఔట్ బ్రేక్ రిపోర్ట్ అంచనా వేస్తోంది. అటు ఏపీలో నవంబర్ నాటికి, తెలంగాణలో అక్టోబర్ 17 నాటికి కరోనా పూర్తిగా అంతం కావొచ్చంది.
0 comments:
Post a comment