Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 2 August 2020

అగ్రదేశాల్లో విద్యాబోధన మాతృభాషలోనే చిరు ప్రాయంలో సొంత భాషలో చదవడం వల్ల మనోవికాసం ఇదే 21వ శతాబ్దపు వ్యూహం

అగ్రదేశాల్లో విద్యాబోధన మాతృభాషలోనే
చిరు ప్రాయంలో సొంత భాషలో చదవడం వల్ల మనోవికాసం
ఇదే 21వ శతాబ్దపు వ్యూహం యువత ఆలోచనలకు ప్రతిబింబం.. నూతన విద్యావిధానం
ప్రధాని మోదీ వెల్లడి

*❇️ఈనాడు, దిల్లీ : కొత్త విద్యా విధానంలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఫలితంగా అవి ముందడుగు వేస్తాయని చెప్పారు. ‘‘ఇప్పటివరకూ మన స్థానిక భాషలను వాటి మానాన వాటిని వదిలేశాం. వాటిని కాపాడి, ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం పెద్దగా చేయలేదు. ఇప్పుడు కొత్త విద్యా విధానంతో దక్కిన ప్రాముఖ్యత వల్ల అవి వికసిస్తాయి. ఇవి భారతీయ విజ్ఞానంతో పాటు ఏకత్వాన్నీ బలోపేతం చేస్తాయి’’ అని తెలిపారు.

 ❇️శనివారం దేశవ్యాప్తంగా జరిగిన ‘హ్యాకథాన్‌ ఇండియా’ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. నూతన విద్యా విధానం వల్ల పిల్లలు చిరుప్రాయంలోనే మాతృభాషలో విద్య నేర్చుకొనే అవకాశం లభిస్తుందన్నారు. ‘‘ఫలితంగా వారి ప్రతిభ మరింత ఇనుమడిస్తుంది. సొంతంగానే సరికొత్త విషయాలు నేర్చుకోవడానికి స్ఫూర్తి లభించడంతోపాటు చదువుతో మమేకమవడానికి వీలవుతుంది’’ అని పేర్కొన్నారు.

❇️జీడీపీ ఆధారంగా ప్రపంచంలో తొలి 20 స్థానాల్లో ఉన్న దేశాల్లో అనేకం.. పిల్లలకు మాతృ భాషల్లోనే విద్యబోధన చేస్తున్నాయన్నారు. ఆ దేశాలు యువత ఆలోచనలు, అవగాహన శక్తిని స్వభాషలోనే వికసింపజేసే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పారు. ‘‘అదే సమయంలో ప్రపంచంతో సంభాషించేందుకు మిగతా భాషలకూ అంతే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ వ్యూహం 21వ శతాబ్దంలో భారత్‌కు లబ్ధి కలిగించనుంది’’ అని పేర్కొన్నారు.

🍁ఈ సందర్భంగా ప్రధాని   ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..

🔸భారతీయ భాషలు అద్భుతం
❇️భారత్‌ వద్ద బహు భాషల ఖజానా ఉంది. వాటిని నేర్చుకోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. ప్రపంచం కూడా వాటిని నేర్చుకునేందుకు కుతూహలం చూపుతోంది. మన భాషల్లో సమృద్ధంగా రచనలున్నాయి. శతాబ్దాల జ్ఞానం, అనుభవం అందులో నిక్షిప్తమై ఉంది. ఇక అది మరింత విస్తృతమవుతుంది. ఆ భాషల గొప్పతనం ప్రపంచానికి తెలుస్తుంది.

🍁యువత ఆలోచనలకు తగ్గట్టుగా..
❇️21వ శతాబ్దపు యువత ఆలోచనలు, అవసరాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని కొత్త విద్యా విధానాన్ని రూపొందించాం. ఇది భారతీయుల ఆకాంక్షల ప్రతిరూపం. ప్రస్తుతం పిల్లలు.. తల్లిదండ్రులు, ఇతరుల బలవంతం మీద సబ్జెక్టులను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. వారిలో అనేక మందికి.. చదివిన దాంట్లో చాలా విషయాలు ఉపయోగపడటంలేదు. డిగ్రీలు చేతికొచ్చినా వారు ఏదో అసంతృప్తికి లోనవుతుంటారు. ఫలితంగా వారిలో ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కొత్తవిద్యావిధానంలో దీన్ని మార్చే ప్రయత్నం చేశాం.

🍁ఇంటెంట్‌... కంటెంట్‌ను మార్చే ప్రయత్నం

❇️భారత విద్యా వ్యవస్థలో క్రమబద్ధమైన సంస్కరణలు తీసుకొస్తున్నాం. ఉద్దేశం, విషయా (ఇంటెంట్‌, కంటెంట్‌)న్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. 21వ శతాబ్దం విజ్ఞాన శకం. చదువు, పరిశోధన, నవకల్పనపై మరింత దృష్టి సారించాల్సిన సమయం ఇదే. ఇప్పుడు జాతీయ విద్యావిధానం అదే చేస్తోంది. మీ సహజ ఇష్టాలకు మరింత వన్నెతెస్తుంది.

 ❇️యువత లెర్నింగ్‌, క్వశ్చనింగ్‌, సాల్వింగ్‌ (అభ్యాసం, ప్రశ్నించడం, పరిష్కరించడం) అనే మూడు అంశాలను మరిచిపోకూడదు. విషయం నేర్చుకుంటే ప్రశ్నించేంత విజ్ఞానం వస్తుంది. ప్రశ్నించే శక్తి వస్తే వినూత్నంగా ఆలోచించి సమస్యలను పరిష్కరించే సామర్థ్యం సాధ్యమవుతుంది. అవి రెండూ వచ్చినప్పుడు వ్యక్తిగా ఎదుగుతారు.

🍁అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగానే

❇️విద్య అందరికీ అందుబాటులో ఉండాలన్న అంబేడ్కర్‌ ఆలోచనలకు అనుగుణంగానే ఈ విధానాన్ని రూపొందించాం. ఉద్యోగాలు అర్థించేవారిగా కాకుండా ఉద్యోగాలను సృష్టించేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ కొత్త విధానం ఉపయోగపడుతుంది. ఉద్యోగం చేయాలా? పారిశ్రామికవేత్తగా మారాలా? అని యువత తనకు తాను నిర్ణయించేకొనే శక్తినిస్తుంది.’’ అని ప్రధాని పేర్కొన్నారు.

❇️ఇండియా స్మార్ట్‌ హ్యాకథాన్‌లో పాల్గొని, నేరాలను అరికట్టడానికి వివిధ కొత్త సాంకేతిక పరిష్కారాలు చూపిన హైదరాబాద్‌ విద్యార్థులను ప్రధాని అభినందించారు. హైదరాబాద్‌లోని ఎంఎల్‌ఆర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వేదికగా జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మాతృశ్రీ ఇంజనీరింగ్‌ కాలేజీ విద్యార్థి అమృత, కేఎంఐటీ విద్యార్థి జతిన్‌, సీఎంఆర్‌ టెక్నికల్‌ క్యాంపస్‌ విద్యార్థి మన్‌ప్రీత్‌ సింగ్‌లతో నేరుగా ప్రధాని సంభాషించారు.

🍁బ్యాగ్‌ల బరువు పాఠశాలలకే పరిమితం

❇️ఇకమీద స్కూల్‌ బ్యాగ్‌ల బరువు పాఠశాలల పరిధి దాటి రాదు. పుస్తకాల బరువులు మోయడానికి బదులు జీవితాంతం ఉపయోగపడే చదువుల వైపు మళ్లుతున్నాం. బట్టీపట్టడం నుంచి సంక్లిష్టంగా ఆలోచించే దిశకు వెళ్తున్నాం. ప్రస్తుత విద్యా వ్యవస్థలోని పరిమితుల వల్ల విద్యార్థుల జీవితాలపై ఏళ్ల తరబడి తీవ్ర ప్రభావం పడింది. ఇకమీదట అలాంటిది ఉండదు. కొత్త విద్యావిధానంలో పిల్లలు, వారి భవిష్యత్తుకు ప్రాధాన్యం ఇచ్చాం. అందులో చేపట్టిన అతిముఖ్యమైన మార్పు బహుళ విషయాల అధ్యయనం. ఒకే విధానం అన్నింటికీ సరిపోదు. ఆర్యభట్ట, లియోనార్డో డావించీ, హెలెన్‌ కెల్లర్‌, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ వంటివారు విభిన్న అంశాల్లో ప్రతిభను చాటారు. ఇష్టమైన సబ్జెక్టులు చదువుకొనే అవకాశాన్ని కొత్త విద్యావిధానం కల్పిస్తోంది.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top