న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న గేట్-2021లో ఐఐటీ బాంబే కొన్ని మార్పులు చేసింది. కొత్తగా మల్టిపుల్ క్వశ్చన్స్‌ను విభాగాన్ని ప్రవేశపెట్టడంతోపాటు, కొన్ని పరీక్ష కేంద్రాలను నూతనంగా చేర్చగా, మరికొన్నింటిని తొలగించింది. ఈమేరకు బ్రోచర్‌ను విడుదల చేసింది.
ఇప్పటివరకు ఉన్న మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (ఎంసీక్యూ), న్యూమరికలర్ ఆన్సర్‌టైప్ ప్రశ్నలకు (ఎన్ఏటీ) తోడు కొత్తగా బహుళ ఎంపిక ప్రశ్నలను జతచేసింది. వీటన్నింటికి అభ్యర్థులు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా సబ్జెక్ట్ ప్రశ్నలకు 72 మార్కలు, జనరల్ ఆప్టిట్యూడ్‌కు 15 మార్కులు, ఇంజినీరింగ్ మ్యాథమెటిక్స్‌కు 13 మార్కులు కేటాయించింది.
ఎగ్జామ్ సెంటర్ల మార్పు
ఇప్పటికే గేట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ఐఐటీ బాంబే తాజాగా పరీక్ష కేంద్రాలలో మార్పులు చేసింది. పరీక్ష కేంద్రల జాబితాలో ఝాన్సీ (ఐఐటీ కాన్పూర్), ధెంకనాల్ (ఐఐటీ ఖరగ్‌పూర్), చంద్రాపూర్ (ఐఐటీ బాంబే), ముజఫరాబాద్ (ఐఐటీ రూర్కీ)లను చేర్చింది. పాలా (ఐఐటీ మద్రాస్)ను పరీక్ష కేంద్రాల నుంచి తొలగించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5-7, 12-14 తేదీల్లో దేశంలోని 195 సెంటర్లు, విదేశాల్లోని 5 సెంటర్లలో ఆన్లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో విదేశాల్లోని కొన్ని పరీక్ష కేంద్రాలను తొలగించే అవకాశం ఉన్నది.
వచ్చే నెల 14 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో ఎంటెక్ అడ్మిషన్లు పొందవచ్చు. అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగాలకు ఈ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
0 comments:
Post a comment