స్కూళ్లు తెరవక ముందే 15 రోజుల్లో 9,700 మంది చిన్నారులకు కరోనా..
న్యూయార్క్: ప్రపంచంలోని వివిధ దేశాల్లో పాఠశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇంతలో అందరినీ కలవరానికి గురిచేసే ఒక వార్త వెలువడింది. యూఎస్‌లో జూలై చివరి 15 రోజుల్లో సుమారు 97,000 మంది పిల్లలు కరోనా బారిన పడ్డారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఈ గణాంకాలను ఒక నివేదికలో వెల్లడించింది. అమెరికాలో కరోనా సోకిన 50 లక్షల బాధితులలో 3 లక్షల 38 వేల మంది పిల్లలు ఉన్నారని ఆ నివేదిక పేర్కొంది. ఈ గణాంకాలను గమనించిన నేపధ్యంలో చాలా మంది నిపుణులు పాఠశాలలను తెరవడంపై చర్చలు ప్రారంభించారు. ఒక్క జూలైలో అమెరికాలో కరోనా వైరస్ కారణంగా సుమారు 25 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆన్లైన్ క్లాసులే మేలని భావిస్తున్నారు. కాగా ప్రపంచంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1.98 మిలియన్లను దాటింది. వీరిలో అత్యధికంగా 51,50,060 మంది కరనా బాధితులు అమెరికాలో ఉండగా, భారత్‌లో 30,13,369 మంది, బ్రెజిల్లో 21,53,010 మంది ఉన్నారు.

0 comments:
Post a comment