మనోధైర్యం ముందు కరోనా ఎంత! ఇంట్లోనే ఉండి 15రోజుల్లోనే కొవిడ్‌ను జయించిన 15మంది సభ్యుల కుటుంబం
కరోనా ప్రాణాంతకమే కానీ దాన్ని జయించడం పెద్ద కష్టమేమీ కాదు. వైద్యుల సలహాలు పాటిస్తూ, మందులు, పౌష్టికాహారం తీసుకుంటే కొవిడ్ నుంచి సులభంగా కోలుకోవచ్చు. అది చిన్న పిల్లలైనా, ముసలి వాళ్లైనా.. కరోనా నుంచి బయటపడొచ్చు. అన్నింటికన్నా ముందు మనోస్థైర్యం ముఖ్యం. కరోనాకు అదే పెద్ద మందు. కరోనాను జయించడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పడానికి ఈ కుటుంబమే నిదర్శనం. ఆ కుటుంబంలో 15మంది ఉంటారు. వారందరికి కరోనా సోకింది. కాగా, వారంతా ఉమ్మడిగా కొవిడ్ ను జయించడం విశేషం.
డాక్టర్ల సూచనలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండి 15రోజుల్లోనే కరోనాను జయించిన కుటుంబం:
ఇంట్లో ఒకరికి కరోనా వస్తేనే కలిగే కంగారు అంతాఇంతా కాదు.
అందులోనూ చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల్లోనైతే మరీ ఆందోళన ఉంటుంది. అలాంటిది.. ఏడాదిన్నర వయసు చిన్నారి మొదలుకుని.. 90 ఏళ్ల వృద్ధురాలి వరకూ.. 15మంది ఉన్న కుటుంబం మొత్తం కరోనాబారిన పడితే. అందరిలా ఆ కుటుంబం కలవరపడలేదు. డాక్టర్ల సూచనలు తీసుకుంటూ ఇంట్లోనే ఉండి.. 15 రోజుల్లోనే కరోనాను జయించింది. సంకల్పం ముందు కరోనా ఏమీ చేయలేదని కలిసికట్టుగా నిరూపించింది.
కరోనా బారిన పడ్డ టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య కుటుంబం:
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణానికి చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి అందె బాబయ్య(61) కుటుంబం నెల రోజుల క్రితం కరోనా బారిన పడింది. కుటుంబంలోని 15 మందికీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. బాబయ్యతో పాటు ఆయన భార్య, ముగ్గురు కుమారులు, మనుమలు, తల్లి వైరస్ బారిన పడినవారిలో ఉన్నారు. బాబయ్య తల్లి చంద్రకళకు 90ఏళ్లు. ఆ ఇంట్లో మరో ఏడాదిన్నర చిన్నారి కూడా ఉంది.
కరోనా ఇలా సోకింది:
అందె బాబయ్య వ్యాపార నిమిత్తం ఓవ్యక్తితో మాట్లాడారు. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలియడంతో తాను పరీక్షలు చేయించుకున్నారు. పాజిటివ్ వచ్చింది. ఒకింత షాక్‌కు గురైన బాబయ్య తన కారు డ్రైవర్‌తోపాటు ఇంట్లోని వారందరికీ పరీక్షలు చేయించారు. అందరికీ పాజిటివ్ వచ్చింది. బాబయ్య రెండో కుమారుడు నర్సింహ రెండు మూడు రోజులు జ్వరంతో ఇబ్బంది పడ్డా హోం ఐసొలేషన్‌లో వెంటనే కోలుకున్నారు. 90ఏళ్ల వృద్ధురాలైన చంద్రకళ ఆయాసం లేకుండా కొవిడ్ ను జయించడం విశేషం. కొవిడ్ బారినపడ్డ 15 మందిలో కొందరు 12 రోజుల్లో కోలుకోగా.. మరి కొందరు కోలుకునేందుకు 15 రోజుల సమయం పట్టింది.
మనోధైర్యమే మందు:
'మా ఇంట్లో వారికి కరోనా అనగానే టెన్షన్ పడ్డాం. ఆ తర్వాత ధైర్యంతో ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది చెప్పినట్టు చేశాం. రోజూ యోగా చేయాలని, కషాయం తాగాలని, కోడిగుడ్లతోపాటు పౌష్టికాహారం తినాలని, వేడి నీళ్లు తాగాలని చెప్పారు. వాళ్లు చెప్పినట్లు చేశాం. మనోధైర్యంతోనే కరోనాను జయించాం. కరోనా వస్తే భయపడొద్దు' అని బాబయ్య చెప్పారు.
కరోనా సమయంలో ఏం తిన్నారు, ఏం తాగారు, ఏం మందులు వాడారు:
మాది ఉమ్మడి కుటుంబం. అంతా కలిసి ఒకే ఇంట్లో ఉంటాము. నాకు ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లు, ఆరుగురు మనుమలు. వారిలో ఏడాదిన్నర చిన్నారి ఉంది. నా తల్లి వయసు 90ఏళ్లు. జూన్ 15 అందరికి కరోనా పాజిటివ్ అని తెలిసింది. కొందరిలో లక్షణాలు స్వల్పంగా ఉన్నాయి. కొంతమందిలో అసలు లక్షణాలే లేవు. దీంతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. కొన్ని యాంటీ బయోటిక్ మందులు, విటమిట్ ట్యాబ్లెట్లు తీసుకున్నాం. రోజుకు మూడుసార్లు ఆవిరి పట్టాం. రోజూ ఉదయాన్నే తృణధాన్యాలు తీసుకున్నాం. రోజుకు రెండు సార్లు ఉడికిన గుడ్డు తిన్నాం. గోరు వెచ్చని నీరు తాగాము. అలాగే నాన్ వెజ్ ఆహారం తీసుకున్నాం అని బాబయ్య తెలిపారు.
కరోనా వస్తే భయపడొద్దు:
కరోనాను జయించిన సందర్భంగా బాబయ్య తన కుటుంబసభ్యులు అందరిని ఒకచోట చేర్చి గ్రూప్ ఫొటో దిగారు. బాబయ్య తన అనుభవాలను వీడియో ద్వారా పంచుకున్నారు. కరోనా వస్తే భయపడొద్దని ఆయన చెప్పారు. కరోనాపై అవగాహన కల్పించేందుకు తాను ఈ వీడియోలో తన అనుభవాలు తెలిపానని బాబయ్య అన్నారు.

0 comments:
Post a comment