అన్న పేరుతో తమ్ముడు ప్రభుత్వోద్యోగం...12 ఏళ్ల నుండి..!
అన్న సర్టిఫికెట్లతో ఓ తమ్ముడు ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. 12 ఏళ్ల నుండి క్వాలిఫికేషన్ లేకపోయినా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఫలాలు అందుకున్నాడు. ఇక చివరికి అన్నా తమ్ముల మధ్య విభేదాలు రావడంతో గుట్టు రట్టయింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రాంతంలోని చంద్రశేఖర్‌నగర్‌కు చెందిన గాదె రాందాస్, గాదె రవీందర్ సోదరులు. గాదె రవీందర్ టీఎస్ఎన్పీడీసీఎల్లో కొద్ది రోజులపాటు కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేసాడు. ఆ తర్వాత తన సర్టిఫికేట్లతో ప్రభుత్వ ఉద్యోగం పొందాడు. అయితే ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రాగా అన్న అధికారులకు కంప్లైంట్ చేసాడు. దాంతో విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు.
రాందాస్ పేరుతో రవీందర్ ఉద్యోగం చేస్తున్నట్లు నిర్ధారణ చేసుకున్నారు. దీంతో రవీందర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

0 comments:
Post a comment