10 months service for contract lecturers
కాంట్రాక్టు లెక్చరర్లకు 10 నెలల సర్వీసే
❇️ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో
పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు 10 నెలల
సర్వీస్ రెన్యువల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం
తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన జిఓ
88ను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి
అనంత రాము శుక్రవారం విడుదల చేశారు.
❇️జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో
పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్ టైం లెక్చరర్లకు
గత ఏడాది వరకు 10 నెలల సర్వీస్ రెన్యువల్
విధానం ఉండేది. అయితే లెక్చరర్లు,
ఉపాధ్యాయ, పట్టభద్ర ఎమ్మెల్సీలు ప్రభుత్వం పై
ఒత్తిడి చేయడంతో 12 నెలల రెన్యువల్
విధానాన్ని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం
ప్రవేశ పెట్టింది.
❇️మరలా ఈ విద్యాసంవత్సరం
10 రోజులు బ్రేక్ తో 10 నెలల సర్వీస్
ఉంటుందని పేర్కొంది. కాగా 10 నెలల సర్వీస్
రెన్యువల్ విధానం విడుదల చేయడం
సమంజసం కాదని, దీనిపై ఆందోళన
చేపడతామని ఎపి గవర్నమెంట్ కాంట్రాక్ట్
లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఫెడరేషన్ తెలిపింది.
0 comments:
Post a comment