Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Monday, 13 July 2020

You will be shocked to know the salary of the bodyguards of these Bollywood stars! బాడీగార్డులు... జీతం కోట్లల్లో..!

You will be shocked to know the salary of the bodyguards of these Bollywood stars!
After becoming a celebrity there are things that come along with it name, fame, money and most importantly fans. Our Bollywood celebrities are people who need security the most since they are most of the time gathered by fans and media persons. And to protect their fans comes to our rescue our powerful bodyguards who become a very important part of their lives.

Their life is definitely tough and there's no doubt about that and it is sure that their salary definitely has to be handsome. Now you might be thinking what will be the annual salary of these people. We have dug out the amounts that our celebrities pay to protect themselves from any mishappening.

Check the fees out:
బాడీగార్డులు... జీతం కోట్లల్లో..!

సినిమావాళ్లు అడుగు బయటపెడితే చాలు, అభిమానుల అతి ప్రేమ ఉప్పెనలా మీదికొచ్చేస్తుంది. అదొక్కటే కాదు, ఇతరత్రా కారణాల వల్లా సెలెబ్రిటీలకు రక్షణ అవసరమే. అందుకే, బాలీవుడ్‌ తారలు కొందరు కోట్ల రూపాయలు జీతాలుగా ఇచ్చి మరీ బాడీగార్డుల్ని నియమించుకుంటున్నారు

సినిమావాళ్లు అడుగు బయటపెడితే చాలు, అభిమానుల అతి ప్రేమ ఉప్పెనలా మీదికొచ్చేస్తుంది. అదొక్కటే కాదు, ఇతరత్రా కారణాల వల్లా సెలెబ్రిటీలకు రక్షణ అవసరమే.
అందుకే, బాలీవుడ్‌ తారలు కొందరు కోట్ల రూపాయలు జీతాలుగా ఇచ్చి మరీ బాడీగార్డుల్ని నియమించుకుంటున్నారు.

షారుఖ్‌ ఖాన్‌

బాలీవుడ్‌ హీరో, నిర్మాత, ఐపీఎల్‌ టీమ్‌ సహ యజమాని అయిన షారుఖ్‌ఖాన్‌కి అభిమానుల్లో ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే, బాద్‌షా బయటి షూటింగులకూ పర్యటనలకూ వెళ్లేటపుడు అంగరక్షకుడు రవి సింగ్‌ వెన్నంటి ఉండాల్సిందే. తన మీద ఈగ కూడా వాలకుండా చూసుకునే రవి సింగ్‌కి షారుఖ్‌ ఏడాదికి రూ.2.5 కోట్లను జీతంగా ఇస్తున్నాడు.చిత్ర పరిశ్రమలోనే ఇది అత్యధికం!

సల్మాన్‌ఖాన్‌

సల్మాన్‌ బాలీవుడ్‌లో తీసిన 'బాడీగార్‌'్డ సినిమా సూపర్‌ డూపర్‌ హిట్‌. ఆ సినిమాని సల్లూబాయ్‌ తన బాడీగార్డ్‌ 'షెరా'కి అంకితమిచ్చాడంటేనే అతడంటే భాయ్‌కి ఎంత ప్రేమో అర్థమవుతుంది. సినిమా ట్రెయిలర్‌ని కూడా షెరాతోనే విడుదల చేయించాడు. పద్దెనిమిదేళ్లుగా సల్మాన్‌ వెంటే ఉంటున్న ఈ బాడీగార్డ్‌ జీతం ఎంతో తెలుసా... ఏడాదికి రూ.2 కోట్లకు పైమాటే. సల్లూభాయ్‌ కుటుంబానికి ఆప్తుడు కూడా అయిన షెరా హాలీవుడ్‌ సింగర్‌ జస్టిన్‌ బీబర్‌ ముంబైకి వచ్చినపుడు అతడికీ అంగరక్షకుడిగా మారిపోతుంటాడు.

అమితాబ్‌ బచ్చన్‌

బిగ్‌ బీ అమితాబ్‌ సినిమా ఫంక్షన్లకు వస్తే అభిమానులే కాదు, సినిమా తారలూ ప్రముఖులు కూడా ఆయన చుట్టూ చేరిపోతుంటారు. ఆ సమయంలో ఆయన వెన్నంటే ఉండి రక్షణ ఇస్తుంటాడు బాడీగార్డ్‌ జితేంద్ర షిండే. సొంతంగా సెక్యూరిటీ ఏజెన్సీ ఉన్నా బిగ్‌ బీకి మాత్రం స్వయంగా తనే అంగరక్షకుడిగా ఉంటాడు. అందుకోసం అతడు తీసుకునే జీతం ఏడాదికి రూ.1.5 కోట్లు.

ఆమిర్‌ ఖాన్‌

మిస్టర్‌ పర్ఫెక్షనిస్ట్‌గా పేరుపొందిన ఆమిర్‌ ఖాన్‌ ఏం చేసినా పద్ధతిగానే ఉంటుంది. అతడి సినిమాలూ పిల్లా పెద్దా అందర్నీ ఆకర్షించేలా ఉంటాయి. ఆమిర్‌ అంగరక్షకుడు యువ్‌రాజ్‌ ఘోర్‌పడె సంవత్సరానికి రెండుకోట్ల రూపాయల్ని జీతంగా అందుకుంటున్నాడు.

దీపికా పదుకొణె

ఇటు నటనతోనూ అటు అందంతోనూ మెప్పించే దీపికా పదుకొణెకు హిందీలో నటించిన తొలిచిత్రం 'ఓం శాంతి ఓం' నుంచే అభిమానులు ఎక్కువ. ఇక, 'చెన్నై ఎక్స్‌ప్రెస్‌', 'పద్మావత్‌' సినిమాలతో దక్షిణాదిలోనూ పేరు తెచ్చుకుంది. అందుకే, అభిమానుల తాకిడి నుంచి తప్పించుకునేందుకు జలాల్‌ను బాడీగార్డ్‌గా నియమించుకుంది. అతడికి ఆమె ఇచ్చే జీతం ఎంతో తెలుసా... ఏడాదికి రూ.కోటి. ఎంతో నమ్మకంగా పనిచేసే జలాల్‌ని దీపిక అన్నయ్యలా భావించి ఏటా రాఖీ కూడా కడుతుంది.

అక్షయ్‌ కుమార్‌

మార్షల్‌ ఆర్ట్స్‌తో ఫిట్‌నెస్‌కి మారుపేరైన హీరో అక్షయ్‌ కుమార్‌ డూప్‌ లేకుండా తన స్టంట్లు తనే చేసుకుంటాడు. కానీ బాడీగార్డ్‌ ష్రెయ్‌సెయ్‌ లేకపోతే మాత్రం అడుగు బయటపెట్టడు. అంతేకాదు, అతడికి జీతంగా ఏటా రూ.1.2 కోట్లను ముట్టజెబుతున్నాడు.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top