Ginger for Weight Loss Benefits : అల్లం అనేది ఓ పూల మొక్క వేరు. అల్లం మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది, ఆహారం జీర్ణం అయ్యేలా చేస్తుంది. ఆకలిని తగ్గిస్తుంది. అందువల్లే అల్లం వాడితే బరువు తగ్గడం గ్యారెంటీ. అల్లం వాడుతూ... ఆరోగ్య నియమాలు పాటిస్తూ... ఎక్సర్‌సైజ్ చేస్తే బరువు తగ్గడం గ్యారెంటీ. కాబట్టి అల్లాన్ని ఎలా వాడాలి? ఎంత వాడాలి? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. అల్లంలో జింజెరాలవ్స్, షోగాల్స్ అనే కాంపౌండ్లు ఉంటాయి. ఇవి మన శరీరంలోకి వెళ్లగానే... చాలా మంచి పనులు చేస్తాయి. మీకు తెలుసా... అధిక బరువు అనేది ఒత్తిడి తెస్తుంది. శరీర వేడిని పెంచేస్తుంది. ఇది అన్ని రకాలుగా నష్టమే కలిగిస్తుంది. ముఖ్యంగా గుండె దెబ్బతింటింది.
అందుకే మనం జింజర్ (అల్లం) వాడాలి. ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగాలంటే అల్లం వాడాలి. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే కూడా అల్లం వాడాలి. ఎందుకంటే అల్లం... మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ కరెక్టుగా ఉండేలా చేస్తుంది.
ఇలా చెయ్యండి : ఓ 20 గ్రాముల అల్లం ముక్కను ముక్కలు చేసి... మిక్సీలో వేసి... అరకప్పు నీరు పోసి... గ్రైండ్ చెయ్యాలి. తద్వారా అల్లంలో రసం మొత్తం నీటిలో కలుస్తుంది. ఆ నీటిని వడగట్టి... అందులో అరబద్ద నిమ్మరసం కలిపి తాగేయాలి. ఇలా రోజూ రెండు లేదా మూడుసార్లు తాగాలి. నిమ్మరసం కూడా మన ఆకలిని చంపేస్తుంది. అల్లం రసం, నిమ్మరసం రెండూ కూడా పొట్ట ఫుల్లుగా ఉన్న ఫీల్ కలిగిస్తాయి. అందువల్ల ఏమీ తినబుద్ధి కాదు. ఫలితంగా బరువు తగ్గుతారు.
యాపిల్ సైడెర్ వెనిగర్ (Apple cider vinegar (ACV)) కూడా బరువు తగ్గించగలదు. పైన చెప్పిన అరకప్పు అల్లం రసంలో... ఈ వెనిగర్ నాలుగు చుక్కలు కలుపుకొని కూడా తాగొచ్చు. అలాగే అల్లం, నిమ్మరసం, యాపిల్ సైడెర్ వెనిగర్ మూడూ కలిపి కూడా తాగొచ్చు. ఎలా తాగినా బరువు తగ్గడం గ్యారెంటీ.
కొంత మంది అల్లం టీ తాగుతారు. ఎలా గంటే... నీటిలో అల్లం ముక్కలు లేదా అల్లంను పేస్టులా చేసి నీటిలో వేసి... ఉడికించాలి. పది నిమిషాలు ఉడికించాక... వడగట్టి... అందులో గ్రీన్ టీ బ్యాగ్ వేసుకొని తాగితే కూడా బరువు తగ్గుతారు. ఇందులో కూడా తేనె, నిమ్మరసం కలుపుకొని తాగొచ్చు. ఈ టీని ఉదయం వేళ రోజూ తాగితే ఎక్కువ ప్రయోజనాలుంటాయి.
అల్లం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మలబద్ధకం సమస్య తీరుతుంది. ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. గుండెకు మేలు చేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచేస్తూ మెమరీ పవర్ పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అన్నీ లాభాలే కాబట్టి అల్లం వాడే విషయాన్ని ఓసారి ఆలోచించండి.
0 Comments:
Post a Comment