AMRAVATI: We are committed to English medium education in the state, said AP Education Minister Adimulapu Suresh. Minister Suresh conducted a review on the new national education policy being taken by the Central Government. He later told the media that several items in the central draft were already being implemented in the state. He said the Center had been informed of the changes made in the state during the year.
అమరావతి: రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమ విద్యకు కట్టుబడి ఉన్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన జాతీయ విద్యా విధానంపై మంత్రి సురేశ్ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ముసాయిదాలోని పలు అంశాలు ఇప్పటికే రాష్ట్రంలో అమలవుతున్నాయన్నారు. ఏడాదిగా రాష్ట్రంలో చేసిన మార్పులను కేంద్రానికి తెలిపామని చెప్పారు.
''ఏడాది కిందటే మానవ వనరుల శాఖను విద్యాశాఖగా జగన్ మార్చారు. విద్యావ్యవస్థలో సమానత్వం ఉండాలని మొదట్నుంచీ చెబుతున్నాం. ఐదు అంశాల ప్రామాణికంగా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం.
తెలుగును ఒక సబ్జెక్టుగా తప్పనిసరి చేస్తాం, రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమ పాఠశాలలతోపాటు తెలుగు మాధ్యమ పాఠశాలలనూ ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కొత్త జాతీయ విద్యా విధానంలోని అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లి అమలు చేస్తాం''అని మంత్రి సురేశ్ తెలిపారు.

0 comments:
Post a comment