యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబేను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. కాల్పుల్లో దుబే చనిపోయినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. వికాస్‌ను మధ్యప్రదేశ్ నుంచి కాన్పూర్‌కు తీసుకువస్తున్న సమయంలో కాన్పూర్ శివారులో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల వాహనం బోల్తా పడింది. ఇదే అదునుగా గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే పారిపోయేందుకు ప్రయత్నించాడు. అంతేకాదు పోలీసుల నుంచి ఆయుధాలను లాక్కునేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరపగా.. వికాస్ దుబే మరణించాడు.
0 comments:
Post a comment