టిక్‌టాక్ బ్యాక్ అంటూ మీ ఫోన్ కు ఏదైనా మెసేజ్ లింక్ వచ్చిందా అయితే జాగ్రత్త అది కనుక క్లిక్ చేశారో..మీ ఫోన్ హ్యాక్ అవ్వడం ఖాయం. ఆ దెబ్బకు మీ ఫోన్ తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు సైతం ఖాళీ అయ్యే అవకాశం ఉందని సైబర్ సెల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఓ లింక్ ను మొబైల్ ఫోన్లకు, వాట్సప్ లోను పంపుతున్నారు. ఈ లింక్ ఓపెన్ చేస్తే మీరు తిరిగి వీడియోలు చూడవచ్చు అని లింక్ పైన సారాంశం కనిపిస్తుంది. వీటిని నిజం అని నమ్మిన నెటిజన్లు ఆ లింక్ ను వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేస్తున్నారు. అయితే ఈ లింకులను ఓపెన్ చేయరాదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. లింక్ లను ఓపెన్ చేస్తే విలువైన సమాచారం సైబర్ చోరుల చేతిలో పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
వాట్సప్ లో లేదా ఏదైనా సోషల్ మీడియాలో వస్తే ఓపెన్ చేయకూడదని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మరో వైపు టిక్ టాక్ బ్యాన్ అవ్వడంతో వినియోగదారులు ఇతర దేశీయ షార్ట్ మెసేజింగ్ యాప్ లను డోన్ లోడ్ చేసుకుంటున్నారు.
0 Comments:
Post a Comment