Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

MORE TO VIEW

Saturday, 11 July 2020

The Sliding Rocks Mystery- మృత్యులోయలో నడిచే రాళ్లు!- అదొక ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరూ మనుషులు ఉండరు. అక్కడ కుప్పలు కుప్పలుగా రాళ్లు మాత్రం ఉంటాయి. రాళ్లుంటే ఏంటీ అనుకుంటున్నారా! అక్కడి రాళ్లన్నీ కదిలే రాళ్ళే మరి! బండరాయి కదలడం ఏంటీ అనుకుంటున్నారా..అయితే ఆ కదిలే రాళ్ల సంగతులేంటో తెలుసుకోండి!

The Sliding Rocks Mystery
One of the most interesting mysteries of Death Valley National Park is the sliding rocks at Racetrack Playa (a playa is a dry lake bed). These rocks can be found on the floor of the playa with long trails behind them. Somehow these rocks slide across the playa, cutting a furrow in the sediment as they move.
Some of these rocks weigh several hundred pounds. That makes the question: "How do they move?" a very challenging one.

రామాయణంలో రామవారధి కట్టేటప్పుడు నీటిపై తేలియాడే రాళ్లను గురించి విన్నాం. ఇప్పటికీ రామేశ్వరంలో ఆ రాళ్లను మనం చూడవచ్చు. అలాంటి ఆశ్చర్యపరిచే విషయం మరోటి కూడా ఉంది. అదొక ఎడారి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఎవరూ మనుషులు ఉండరు. అక్కడ కుప్పలు కుప్పలుగా రాళ్లు మాత్రం ఉంటాయి. రాళ్లుంటే ఏంటీ అనుకుంటున్నారా! అక్కడి రాళ్లన్నీ కదిలే రాళ్ళే మరి! బండరాయి కదలడం ఏంటీ అనుకుంటున్నారా..అయితే ఆ కదిలే రాళ్ల సంగతులేంటో తెలుసుకోండి!

అమెరికాలోని మిడిల్‌ కాలిఫోర్నియాలోని పానామింట్‌ పర్వతాలకు సమీపంలో మృత్యులోయ అనే ప్రదేశం ఉంది. అక్కడ జనసంచారం ఉండదు కాబట్టి దానికి ఆ పేరు వచ్చింది. అక్కడ రాళ్లు జీవం ఉన్న ప్రాణుల్లా వాటంతట అవే కదులుతాయి. ఈ రాళ్లనే సెయిలింగ్‌ స్టోన్స్‌ అనీ, స్లైడింగ్‌ రాక్స్‌ అనీ, మూవింగ్‌ రాక్స్‌ అనీ ఇలా ఎవరికి తోచిన పేర్లు వారు పెడుతూ వచ్చారు. అక్కడ ఎడారిలో ఎండిన సరస్సులో బరువైన రాతిశిలలు కదులుతూ ఉంటాయి. ఒక్కో రాతిశిల బరువు 700 పౌండ్లు ఉంటుంది.
 ఎలా తెలుస్తోంది?
రాళ్లు కదులుతాయంటే సరే నమ్ముదాం. కానీ అవి కదిలినట్లు మనకి ఎలా తెలుస్తుంది అనేగా మీ సందేహం. అవి ఎంత దూరం ప్రయాణించాయో ఆ ప్రయాణించిన మేరకు చారలు స్పష్టంగా కనిపిస్తాయి అక్కడ. చార చివరలో రాయి ఆగి ఉంటుంది. ఆ చారల ద్వారా ఆ రాయి ఎక్కడ నుంచి ఎక్కడికి దొర్లుకుంటూ వచ్చిందనే విషయం తెలుసుకోవచ్చు. ఈ రాళ్లు కొలువై ఉన్న సరస్సును అక్కడ పర్యాటక అభిమానులు రేస్‌ ట్రాక్‌ ప్లే అంటూ వ్యవహరిస్తారు. ఈ ప్రాంతం కొండల మధ్య ఉన్న ఓ విశాలమైన మైదానంలా, చాలా చదనుగా ఉంటుంది. అయితే రాళ్లు రోజూ కదులుతూ ఉంటాయి అనుకుంటే పొరబాటే. రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఈ రాళ్లు కదలడం లేదా దొర్లడం జరుగుతూ ఉంటుంది. అదీ సమాంతరంగా ఒక రాయి కదలడం మొదలుపెడితే ఆ రాతితో పాటే మరో రాయి తన దిశను మార్చుకుంటుంది. దిశ మార్చుకున్న రాయి, సమాంతర రాయి రెండూ ఒకే బరువుతో ఉండడం ఇంకో విశేషం.

రకరకాల ఊహాగానాలు
ఈ ప్రాంతంలో పెద్దగా జంతు సంచారం కూడా ఉండదు. కనుక వాటివల్ల రాళ్ళు కదిలే అవకాశం లేదు. జనసంచారం కూడా ఆ ప్రాంతంలో చాలా తక్కువ. దాదాపు తొంభై సంవత్సరాల క్రితం పరిశోధకులు ఈ రాళ్ల కదలికలను మొదటిసారి గుర్తించారు. ఇప్పటికి అరవైఏడేళ్ళుగా వీటి కదలికలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ పరిశోధనలు చాలా వరకు సఫలీకృతం కాలేదు. ఎందుకంటే ఈ రాళ్లు కదులుతుండగా ఇంతవరకు ఎవరూ చూడలేదు.

ప్రయోగాలు
మంచు పర్వతశ్రేణులైతే రాతి శిలలు వేగంగా కదులుతాయనటానికి ఆస్కారం ఉంది. కానీ ఇక్కడ ఆ దాఖలాలు లేవు. పరిశోధనలు జరుగుతున్నతసేపూ ఒక్క అంగుళం కూడా కదలని రాళ్లు ఆ పరిశోధనలు ముగిసి తిరిగి వెళ్లిపోతున్నప్పుడు కదిలాయి. కానీ వీటిని వీడియోలో బంధించలేక పోయారు. ఫోటోలు మాత్రం తీయగలిగారు. ఆ తర్వాత 1955లో, 1972లో బాండ్‌ షార్ప్‌, డ్విట్‌ కేరే అనే శాస్త్రవేత్తలు మళ్లీ పరిశోధనలు మొదలుపెట్టారు. ఆయా ప్రాంతాల్లో అప్పటికే 30 రాతిశిలల్లో కదలిక ఉందని గ్రహించారు. ఏడేళ్ల సుదీర్ఘ కాలంలో పరిశోధనల్లో కొంత పురోగతి కనిపించినప్పటికీ సంగతులేవీ సరిగ్గా తెలియలేదు.

అసలేంటీ రహస్యం
ఆ ప్రాంతం కొండల మధ్యలో ఉంటుంది. వర్షాకాలంలో అక్కడ భారీగా వర్షాలు కురుస్తాయి. కొండల వాలు వెంబడి వర్షం నీరు జారి మైదానాన్ని ముంచెత్తుతుంది. ఆ ప్రాంతం చిన్నపాటి సరస్సులా మారుతుంది. ఎండాకాలంలో నీరు పూర్తిగా ఇంకిపోతుంది. ఎండిన నేలలో బీటలు పడతాయి. అప్పుడు ఆ నేల మీద పూర్తిగా తడి ఆరని పరిస్థితుల్లో నేల చిత్తడిగా ఉంటుంది. ఈ స్థితిలో రాళ్లకి నేలకి మద్య రాపిడి కాస్త తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో గాలి ప్రభావం వల్ల రాళ్లు మరికొంచెం వేగంగా కదిలే అవకాశం ఉంది.

గాలి వల్లనే
ఆ ప్రాంతంలో గమనించదగిన విషయం ఏంటంటే అక్కడ బలమైన ఈదురు గాలులు వీస్తాయి. అక్కడి గాలులు సామాన్యంగా నైరుతి దిశ నుంచి ఈశాన్యదిశ వైపు వీస్తుంటాయి. విచిత్రమేమిటంటే, కదిలే రాళ్ల దిశ కూడా ఈ క్రమంలోనే ఉంటుంది. ఈ విషయమై ఓ వైజ్ఞానిక బృందం పరిశోధించింది. మంచు, గాలి రాళ్ల కదలికకు కారణమనీ, వేసవి కాలంలో వీటిలో కదలికలు లేవనీ, శీతాకాలంలో మాత్రమే కదులుతున్నాయని తేల్చారు. ఆయా కాలాల్లో వీచే గాలులు,శీతోష్ణ స్థితిగతులు ఇవన్నీ రాతి కదలికలపై ప్రభావాన్ని చూపుతున్నాయని కనుగొన్నారు.

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top