Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Saturday, 18 July 2020

Teacher transfers ఉపాధ్యాయ బదిలీలు సందిగ్ధత.!


ఉపాధ్యాయ బదిలీలు సందిగ్ధత!
***
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఉపాధ్యాయులకు బదిలీలు జరపాలని ఉపాధ్యాయ సంఘాలు పలుమార్లు ప్రాతినిధ్యం చేయగా ఈ నెలలో జరపడానికి ప్రభుత్వం అంగీకరించింది. కానీ కరోనా నేపథ్యంలో ఉపాధ్యాయ బదిలీలు ఎంతవరకు జరుగుతాయన్న సందిగ్ధత ఉపాధ్యాయుల్లో నెలకొని ఉంది. గత కొద్ది రోజులక్రితం ఉపాధ్యాయ బదిలీల గూర్చి చర్చించడానికి రాష్ట్ర   విద్యా కమీషనర్ ఉపాధ్యాయ సంఘాలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈసమావేశంలో  ముఖ్యమైన విషయాలు చర్చకు రాలేదని అధిక శాతం ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.  రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు ఆన్ లైన్ విధానంలో జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. మాన్యువల్ పద్ధతిలో జరపాలని ఉపాధ్యాయులు కోరుకుంటున్నారు. తప్పనిసరి  బదిలీలు ఉన్న హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పండితులకు వెబ్ కౌన్సిలింగ్ కొంతవరకు అనువుగానే ఉంటుంది. రేషనలైజేషన్, ఎనిమిది అకడమిక్ సంవత్సరాలు పూర్తైన ఎస్జీటీ ఉపాధ్యాయులు ప్రతి జిల్లాలో సుమారు మూడు వేల మంది వరకూ ఉంటారు. వీరంతా తప్పనిసరి బదిలీ కావలసి వారు. ఒక ఎస్జీటీ ఒక మండలంలో ఒక పాఠశాలను కోరుకోవడానికి మూడువేల ఆప్షన్స్ ఇవ్వాలంటే  ఎంత కష్టతరమో అధికార్లు ఆలోచించాల్సి ఉంది. అంతేకాకుండా ఈవిధానంలో పారదర్శకత ఉండదనే అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యమైన ఖాళీలు కనపడకుండా చేసే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ అంటే  కోరుకున్న పాఠశాలకు వెళ్లడం. 2017 లో జరిగిన అనుభవాల దృష్ట్యా ఉపాధ్యాయులకు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా కోరుకున్న పాఠశాలకు అవకాశం రాక పోవచ్చు. అన్నీ మండలాల్లో ఉన్న అన్ని పాఠశాలల వివరాలు ఉపాధ్యాయులకు తెలియదు.  ఒకసారి పొరపాటున తెలియని ప్లేసు ఆప్టెడ్ చేసుకోవడం జరిగితే కొన్ని సంవత్సరాల పాటు ఉపాధ్యాయులు బాధపడుతూ మానసిక ఆందోళన చెందుతారు. ఇటువంటి ముఖ్యమైన విషయం మీద ఉపాధ్యాయ సంఘాలు నామమాత్రంగా కూడ చర్చజరపలేదని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు పునాది ప్రాథమిక విద్య. దీనిని బలోపేతం చేయడానికి విధాన పరమైన మార్పులు తీసుకురావడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు దాటినా ప్రాథమిక విద్యలో ఇంకా ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. తగినంత మంది ఉపాధ్యాయులను కేటాయించకుండానే విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని కోరుకోవడం ప్రభుత్వానికి అత్యాశే అవుతుంది. సిలబస్ తక్కువగా ఉన్న రోజులలో  ఉపాధ్యాయ, విద్యార్ధి నిష్పత్తి  1: 30 గా ఉండేది.  సిలబస్ పెరగడం, శాస్త్ర, సాంకేతిక విద్యను అందించాల్సిన ఈ రోజుల్లో కూడ అదే నిష్పత్తి కొనసాగడం సరియైన విధానం కాదు.  ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1:20 గా మార్పు చేయాలి. అప్పుడే విద్యార్ధులకు గుణాత్మకమైన విద్య అందుతుంది. రేషనలైజేషన్ కు ముందు ఆ గ్రామంలో  ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను కూడా పరిగణనలోకి తీసుకొని తప్పని పరిస్థితుల్లో మాత్రమే రేషనలైజేషన్ చేయాలి. ఒకసారి ఉపాధ్యాయ పోస్ట్ పోతే పిల్లల సంఖ్య ఎంత పెరిగినా మరలా ఉపాధ్యాయ పోస్ట్ వచ్చే పరిస్థితి ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో లేదు. ఈ విషయంలో అధికారులు, ప్రభుత్వం పునరాలోచించాలి. ఆంగ్ల మాధ్యమం, నాడు-నేడు, జగనన్న గోరుముద్ద, అమ్మ ఒడి,  జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన వంటి కార్యక్రమాలు, పాతిక దాకా యాప్ ల ఆపరేటింగ్ కు   ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు అధిక సమయం కేటాయించాల్సి వస్తున్నది. ఇద్దరు ఉపాధ్యాయులున్న పాఠశాలలు  ఏకోపాధ్యాయ పాఠశాలలే అవుతాయి. కాబట్టి   ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక  పి.ఎస్.హెచ్.ఎం పోస్ట్ ఇవ్వాలి.  పాఠశాలలో ఎంత ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఉంటే తల్లిదండ్రులు వారి పిల్లలను మన పాఠశాలలో చేర్పించడానికి అంత ముందుకు వస్తారు. అప్పుడే ప్రాథమిక విద్యా రంగం అభివృద్ధి చెందుతుంది.  కొన్ని జిల్లాల్లో ప్రాధమికోన్నత పాఠశాలల్లో ఉన్న పండిట్ పోస్టులన్నీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులుగా  అప్ గ్రేడ్ అయినాయి. పండిట్ ఖాళీలు లేవు.    డి.ఇ.ఒ పూల్ లో ఉన్న పండితులను  ప్రాథమికోన్నత పాఠశాలల్లోఎలా సర్దుబాటు చేస్తారో వివరణ యివ్వలేదు. మాన్యువల్ కౌన్సిలింగ్, ఉపాధ్యాయ, విద్యార్ధి నిష్పత్తి 1:20 గా తీసుకోవడం, సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి ప్రాధమిక పాఠశాలకు పి.ఎస్.హెచ్.ఎమ్ పోస్ట్ మంజూరు, 5 సంవత్సరాలు నిండిన పిల్లల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని  రేషనలైజేషన్ జరపడం వంటి విషయాలమీద అధికారులు, ప్రభుత్వం పునరాలోచించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
ఎస్జీటీల బదిలీలు మాత్రం  మాన్యువల్ పద్ధతిలో జరగాలని, 2019, 2020 సంవత్సరాలలో పదోన్నతుల ద్వారా భర్తీ అయిన ఖాళీలను కూడ ఈ బదిలీలలో ఖాళీలుగా చూపాలని, బదిలీలలో సర్వీసు పాయింట్లు సంవత్సరానికి    ఒక పాయింటు యివ్వాలని, స్టేషన్ సీనియారిటీకి పాయింట్లు మొదటి కేటగిరికి ఒకటి, రెండవ కేటగిరికి రెండు, మూడవ కేటగిరికి మూడు, నాల్గవ కేటగిరికి నాలుగు ప్రకారం యివ్వాలని, 8 సంవత్సరాల సర్వీసుకు ప్రత్యేకంగా పాయింట్లు అవసరం లేదని, 2017 బదిలీలలో ఇచ్చిన ఇతర పాయింట్లు ఏవీ అవసరంలేదని, స్పెషల్ పాయింట్లు, ప్రెఫరెన్షియల్ నిబందనలు 2017 బదిలీల ప్రకారం ఇవ్వాలని ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అదేవిధంగా ఆంగ్లమాధ్యమం, పరిపాలనాపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ఒక పి.ఎస్.ఎచ్.ఎం పోస్ట్ ఇవ్వాలని, ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి 1: 20 గా ఉండాలని, విద్యార్థుల సంఖ్య 40 దాటితే మూడవ పోస్ట్ ఇవ్వాలని, 100 దాటితే ఒక పి.ఎస్.ఎచ్.ఎం, ఐదు ఎస్జీటీ పోస్టులు ఉండాలని, ఆపైన ప్రతి 20 మందికి ఒక ఎస్జిటి పోస్ట్ ఇవ్వాలని, ఆంగ్ల మాధ్యమాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థుల సంఖ్య తో సంబంధం లేకుండా ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఎస్.ఎ. తెలుగు ,ఇంగ్లీషు, హిందీ, గణితము, (గణితాన్ని సైన్సుగా పరిగణించకుండా) సైన్స్, సోషల్ పోస్టులను ఇవ్వాలని, మండలంలో  సైన్స్ పోస్టులు ఫిజికల్, బియలాజికల్ సైన్స్ సమాన నిష్పత్తిలో ఉండాలని, దీని వలన పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది.  ఉపాధ్యాయులకు భారం ఉండదు. అలాంటి సందర్భాల్లో ఆంగ్లమాధ్యమం విజయవంతం అవుతుందని అధిక శాతం ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు.
- వాసిలి సురేష్
9494615360

2 comments:

  1. Meeru category 4 lo pani cheste telisundedi

    ReplyDelete
  2. Web counciling lo meeku kavalsina place meeku rakunda meekante pointslo venukanunna vallaku radu kani manual councilinglo vastundi

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top