Amravati: The Education Ministry has made a key statement on the re-opening of schools in AP. Until schools reopen, it is suggested that all focus on the educational calendar issued by the NCERT. School Education Commissioner Chన్inna Veerabhadra has directed the owners of private unaided schools not to open schools in the same way until further notice by the Department of Education. He also directed the Regional Joint Directors and DEOs to implement special rules to this extent.
ఏపీలో స్కూల్స్ రీ-ఓపెనింగ్‌పై విద్యాశాఖ ప్రకటన
అమరావతి : ఏపీలో స్కూళ్ల రీ ఓపెనింగ్‌పై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. స్కూళ్లు తిరిగి ప్రారంభమయ్యే వరకూ అన్నీ ఎన్సీఈఆర్టీ జారీ చేసిన విద్యా క్యాలెండర్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. విద్యాశాఖ ప్రకటన చేసేంతవరకూ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి పరీక్షలు అదే విధంగా స్కూల్స్ ఓపెన్ చేయకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రీజినల్ జాయింట్ డైరెక్టర్లు, డీఈఓలు ప్రత్యేక నిబంధనల అమలు చేయాలని ఆయన ఆదేశించారు.
ర్యాంకులు ఇవ్వొద్దు..
'విద్యార్థులకు పరీక్షలు మార్కులు, ర్యాంక్‌లు ఇవ్వకూడదు. ప్రత్యామ్నాయ విద్యా సంవత్సర క్యాలెండర్‌ను ఎన్సీఈఆర్టీ సిద్ధం చేసింది.
ప్రత్యామ్నాయ విద్యా సంవత్సర క్యాలండర్‌ను అన్ని స్కూళ్ల పాటించాలి. ఆన్లైన్ అభ్యాసం కొనసాగించడాన్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అయితే ప్రైవేట్ పాఠశాలల యజమాన్యం ఆన్లైన్ క్లాస్‌లు నిర్వహించి ఫీజులు చెల్లించమంటున్నారని ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని పాఠశాలలు విద్యార్థులకు టెస్ట్‌లు పెట్టి మార్కులు, ర్యాంకులు కూడా ఇస్తున్నారని మా దృష్టికి వచ్చింది.
రాష్ట్రంలో ఇంకా అకడమిక్ క్యాలెండర్ తయారు కాలేదు. పనిదినాలు, సిలబస్ తగ్గింపు ద్వారా విద్యార్థుల అభ్యాసంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. టీచర్లు, సోషల్ మీడియా, టెక్నాలజీ సాయంతో అకడమిక్ విద్యను పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు విద్యార్థులకు అందించాలి. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ 8 వారాల ప్రత్యామ్నాయ క్యాలెండర్‌ను ప్రాథమిక విద్యకు విడుదల చేసింది' అని చిన వీరభద్రుడు స్పష్టం చేశారు.

0 comments:
Post a comment