Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Wednesday, 29 July 2020

SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే

SBI Jobs: 3850 jobs in SBI ... This is the application process
 It is learned that State Bank of India-SBI has recently issued a notification for the recruitment of 3850 Circle Based Officer posts.  The application process for these posts is ongoing.  There is another two weeks to apply.  Degree holders can apply for these posts.  There are 550 vacancies in Telangana alone.
SBI Jobs: ఎస్‌బీఐలో 3850 జాబ్స్... అప్లికేషన్ ప్రాసెస్ ఇదే
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఇటీవల 3850 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి మరో రెండు వారాల సమయం ఉంది. డిగ్రీ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. తెలంగాణలోనే 550 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఇతర పద్ధతుల్లో దరఖాస్తుల్ని ఎస్‌బీఐ స్వీకరించదు. దరఖాస్తు చేసే అభ్యర్థులకు పనిచేస్తున్న ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ ఉండాలి. వాటికే పరీక్షలు, కాల్ లెటర్స్, ఇతర వివరాల సమాచారం లభిస్తుంది. దరఖాస్తు చేసేముందు అభ్యర్థులు నోటిఫికేషన్ పూర్తిగా చదివి తమకు అర్హతలు ఉన్నాయో లేదో తెలుసుకోవాలి.ఆ తర్వాత అప్లై చేయాలి.

ఎస్‌బీఐలో సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసే ముందు అభ్యర్థులు రీసెంట్ ఫోటో, సంతకం, ఐడీ ప్రూఫ్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఎడ్యుకేషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్‌తో రెజ్యూమె, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లను పీడీఎఫ్ రూపంలో సిద్ధం చేసుకోవాలి. వీటితో పాటు ఎంబీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఐసీడబ్ల్యూఏ లాంటి ప్రొఫెషనల్ సర్టిఫికెట్, JAIIB/ CAIIB లాంటి సర్టిఫికెట్లు ఉంటే సిద్ధం చేసుకోవాలి. ఎక్స్‌పీరియరెన్స్ సర్టిఫికెట్, ఫామ్ 16 లాంటివి కూడా రెడీగా పెట్టుకోవాలి. అన్నీ స్కాన్ చేసి సిద్ధంగా ఉన్న తర్వాతే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభించాలి. లేకపోతే ఏ డాక్యుమెంట్ లేకపోయినా అప్లికేషన్ ప్రాసెస్‌ను మధ్యలోనే ఆపెయ్యాల్సి ఉంటుంది.
ఇక అభ్యర్థులు ముందుగా https://bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. Current Openings పైన క్లిక్ చేస్తే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ నోటిఫికేషన్ కనిపిస్తుంది. నోటిఫికేషన్ చదివిన తర్వాత Apply లింక్ పైన క్లిక్ చేయాలి. మీ వివరాలతో అప్లికేషన్ ఫామ్ పూర్తి చేయాలి. ఫోటోలు, డాక్యుమెంట్స్ అప్‍లోడ్ చేయాలి. ఒకసారి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం ఉండదు. అందుకే వివరాలన్నీ సరిచూసుకోవాలి. చివరగా ఫీజు చెల్లించి దరఖాస్తు రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించొచ్చు.
దరఖాస్తు ఫామ్‌, పేమెంట్ రిసిప్ట్ డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్‍వర్డ్ ఎక్కడైనా రాసిపెట్టుకోవాలి. ప్రింట్ తీసిన అప్లికేషన్ ఫామ్‌ను బ్యాంకుకు పంపాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ లేదా దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయడంలో ఏవైనా సమస్యలు 022-22820427 నెంబర్‌కు వర్కింగ్ డేస్ రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top