The corona epidemic has changed the lifestyle of many people. Sanitizer is now used in every home. Coming home from the outside .. going out of the house .. cleaning hands with sanitizer. Hand sanitizer has become a must in all shops and offices. Some even wander around pocketing a small sanitizer bottle. This insecticide is so close to everyone. However, the government has increased the prices of low cost sanitizers as part of the corona binding. The central finance ministry has clarified that the sanitizer 18 per cent falls under the GST slab.
కరోనా మహమ్మారి మనుషుల జీవన శైలినే మార్చేసింది. ఇప్పుడు ప్రతి ఇంట్లో శానిటైజర్ వాడుతున్నారు. బయటి నుంచి ఇంటికి వచ్చినా.. ఇంటి నుంచి బయటకు వెళ్లినా..శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకుంటున్నారు. అన్ని షాపులు, ఆఫీసుల్లోనూ హ్యాండ్ శానిటైజర్ తప్పనిసరిగా మారింది. కొందరైతే చిన్న శానిటైజర్ బాటిల్‌ను జేబులో పెట్టుకొనే తిరుగుతున్నారు. అందిరికీ అంతలా దగ్గరైంది ఈ క్రిమి సంహారిణి. ఐతే కరోనా కట్టడిలో భాగంగా తక్కువ ధరకే శానిటైజర్ అందించాల్సిన ప్రభుత్వం.. వాటి ధరలను పెంచింది. శానిటైజర్ 18 శాతం జీఎస్టీ శ్లాబ్ పరిధిలోకి వస్తుందని కేంద్ర ఆర్థిక స్పష్టం చేసింది.
సూక్ష్మ క్రిములను నాశనం చేసేందుకు ఉపయోగించే సబ్బులు, డెట్టాల్ లాంటి ద్రావణాలతో పాటు ఆల్కాహాల్ బేస్డ్ శానిటైజర్‌కు కూడా 18 జీఎస్‌టీ వర్తిస్తుందని తెలిపింది.
అంతేకాదు శానిటైజర్ల తయారీకి వాడే రసాయనాలు, వాటి ప్యాకింగ్ కోసం ఉపయోగించే సామగ్రి అంతా 18 శాతం పన్ను పరిధిలోకి వస్తాయని వెల్లడించింది. శానిటైజర్లు సంబంధిత వస్తువులపై పన్ను తగ్గిస్తే... దిగుమతులు పెరిగి, దేశీయ ఉత్పత్తిదారులకు ఇబ్బందులు తలెత్తే అవకాశముందని కేంద్రం అభిప్రాయపడింది. జీఎస్‌టీ రేట్లను తగ్గిస్తే శానిటైజర్లను దిగుమతి చేసుకునే వారికే అధిక లాభాలు అందుతాయని, చివరకు అది ఆత్మనిర్భర్ భారత్ విధానానికి విరుద్ధంగా అవుతుందని తెలిపింది.కాగా, హ్యాండ్ శానిటైజర్‌తో పాటు మాస్క్‌లను నిత్యావసర వస్తువుల జాబితాలో పొందుపరించారు.
ఐనప్పటికీ మినహాయింపులకు సంబంధించి ప్రత్యేక జాబితా ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. మార్చి, ఏప్రిల్‌తో పోల్చితే శానిటైజర్ల సరఫరా పెరగడంతో.. వీటిని నిత్యావసర వస్తువుల జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించాయి. ఐతే కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కరోనా కట్టడి కోసం ప్రజలకు ఇంకా తక్కువ ధరకు అందించాల్సింది పోయి.. ప్రజలపై మరింత భారం మోపుతారా? అంటూ విపక్షాలు మండిపడుతున్నాయి.

0 Comments:
Post a Comment