Search This Blog

Monday, 13 July 2020

కృష్ణా చంద్ర బిస్వాల్‌ ఓ ఆర్మీ జవాన్‌. తుపాను గాలుల తీవ్రత నుంచి తమ గ్రామాలను రక్షించటానికి తీరానికి ఏకంగా చెట్ల కంచెనే వేసాడు.

Nearly 21 years ago, retired army jawan, Krushna Chandra Biswal began planting palm, jamun, mango and other fruit saplings along the coastline of his village, Gundalaba, which is located in Odisha’s Puri district.
Today, he has planted around 50,000 saplings over an area of 5 km upto the Gumuti Keshab temple of a nearby village (Daluakani) with the hope that this effort will result in tree cover that will stand as a bulwark against cyclones and help prevent soil erosion.

More details in Telugu...
సహజంగా రిటైర్‌ అయిన తరువాత వచ్చిన డబ్బును సంతానానికి పంచటమో, ఆస్తులు సమకూర్చుకోవటమే చేస్తుంటారు చాలామంది. కాని ఓ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా 50 వేల మొక్కలు నాటడానికి ఉపయోగించాడు. తుపాను గాలుల తీవ్రత నుంచి తమ గ్రామాలను రక్షించటానికి తీరానికి ఏకంగా చెట్ల కంచెనే నిర్మించాడు.

ఒడిశా రాష్ట్రంలో పూరి జిల్లాలో గుండలబా గ్రామానికి చెందిన కృష్ణా చంద్ర బిస్వాల్‌ ఓ ఆర్మీ జవాన్‌. 1999లో సెలవుల నిమిత్తం ఊరికి వచ్చాడు. ఊరు అంతా ఇసుకతో నిండిపోయి ఉంది. మేత లేక పశువులు ఆకలితో అలమటిస్తున్నాయి. పంట పొలాలు నాశనం అయ్యాయి. నేలంతా కోసుకుపోయినట్లు అయ్యింది. ఈ దృశ్యం అతడికి ఎంతో బాధ కలిగించింది.
సమీపంలోని ఆస్టారంగ బీచ్‌ నుంచి టన్నుల ఇసుక ఆ గ్రామంలోకి కొట్టుకువచ్చింది. 1999 నాటి 'సూపర్‌ తుఫాను' వల్ల ఊరంతా ఇలా అయ్యింది. గ్రామాన్ని ఆ పరిస్థితుల్లో చూసిన అతను తన ఊరు గానీ, చుట్టుపక్కల గ్రామాలు గానీ ఇక ఏ తుఫాను వల్ల నాశనం కాకూడదనుకున్నాడు. పరిష్కార మార్గం వైపు అడుగులు వేశాడు.

50 వేల మొక్కల నాటివేత
తుపానుకు గురైన తీరం వెంబడి నుంచి సమీప గ్రామాల వైపు (దలుకాని) గుముతి కేషాబ్‌ ఆలయం వరకు 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 50 వేల మొక్కలను నాటాలని అనుకున్నాడు. ఈ పని చేసేందుకు తనకు సహాయంగా తన గ్రామంలోని కొంతమంది స్నేహితులను, పిల్లలను ఒకచోటకు చేర్చాడు. తను చేయాలనుకున్న పనిని వివరించాడు. వాళ్లు కూడా ఎంతో ఉత్సాహంతో మొక్కలు నాటేందుకు సిద్ధపడ్డారు. జనవరి 2005లో తాను ఉద్యోగ విరమణ చేసిన తరువాత వచ్చిన డబ్బుతో పర్యావరణ పరిరక్షణ చేపట్టాడు.
15 సంవత్సరాల నుంచి సమీప అటవీ ప్రాంతంలో తాటి విత్తనాలు సేకరించాడు. వాటిని తన సైకిల్‌తో తీసుకెళ్ళి, సముద్రం నుంచి 100 మీటర్ల దూరంలో లైనింగ్‌ చేశాడు. ఈ క్రమంలో ప్రభుత్వ భూమిని అతడు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు కృష్ణాభారును అనుమానించారు. ఆఫీసుకు పిలిపించి విచారించారు. అధికారులకు తన ఆలోచనని వివరించి చెప్పాడు కృష్ణాబారు. ఆ మాటలు విన్న అధికారులు అతను ఏ విధంగా మొక్కలు నాటుతున్నాడో గమనించడం మొదలుపెట్టారు.
తీరం వెంబడి తాటి మొక్కలు, జామాయల్‌, మామిడి, సరిగ చెట్లు నాటాలనుకున్నాడు. ఈ చెట్లు తుపాను వల్ల నష్టం కలగకుండా గ్రామాలను కాపాడతాయని, గ్రామస్తులకు ఫలసాయాన్నీ ఇస్తాయని అతడు చెబుతాడు. అతడు నాటినమొక్కలు ఇప్పుడు పెద్ద చెట్లుగా మారుతున్నాయి. తుపానును, పెను గాలులను అడ్డుకునే ఓ కంచెలాగా నిలబడి, నేల కోతకు గురికాకుండా తోడ్పడుతున్నాయి. ఆర్మీ జవానుగా దేశానికి రక్షణగా నిలిచిన కృష్ణ ... ఇప్పుడు గ్రామాల సంరక్షణకు ఓ గొప్ప కంచెలా నిలబడ్డాడు. అతడికి సెల్యూట్‌ చేద్దామా మరి?

0 Comments:

Post a Comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Technology

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top