రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI గతంలో వాయిదా వేసిన జాబ్ నోటిఫికేషన్‌కు మళ్లీ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తోంది. కన్సల్టెంట్స్, స్పెషలిస్ట్స్, అనలిస్ట్ పోస్టుల భర్తీకి ఆర్‌బీఐ గతంలోనే నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 9న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించడంతో నోటిఫికేషన్‌ను వాయిదా వేసింది ఆర్‌బీఐ. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని అప్పట్లో నోటీసు విడుదల చేసింది. ప్రస్తుతం లాక్‌డౌన్ ఆంక్షల్ని దశలవారీగా సడలిస్తుండటంతో ఈ నోటిఫికేషన్‌కు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. 2020 మార్చి 27న జారీ చేసిన ప్రకటననే పరిగణలోకి తీసుకోవాలని, ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించిన అర్హతు, నియమనిబంధనలే వర్తిస్తాయని తెలిపింది.
ఆగస్ట్ 3న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి ఆగస్ట్ 22 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 39 అప్లైడ్ మ్యాథ్స్, అప్లైడ్ ఎకనోమెట్రిక్స్‌లో కన్సల్టెంట్, డేటా ఎనలిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.rbi.org.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 39
కన్సల్టెంట్ (అప్లైడ్ మ్యాథ్స్)- 3
కన్సల్టెంట్ (అప్లైడ్ ఎకనోమెట్రిక్స్)- 3ఎకనమిస్ట్ (మ్యాక్రోఎకనమిక్ మోడలింగ్)- 1
డేటా అనలిస్ట్ / MPD- 1
డేటా అనలిస్ట్ / DoS- DNBS- 2
డేటా అనలిస్ట్ / DoR-DNBS- 2
రిస్ట్ అనలిస్ట్ / DoS- DNBS- 1
రిస్ట్ అనలిస్ట్ / DEIO- 2
ఐఎస్ ఆడిటర్- 2
స్పెషలిస్ట్ ఇన్ ఫోరెన్సిక్ ఆడిట్- 1
అకౌంట్స్ స్పెషలిస్ట్- 1
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్- 9
ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్- 5
నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్- 6
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఆగస్ట్ 3
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఆగస్ట్ 22 సాయంత్రం 6 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, దివ్యాంగులు-జనరల్ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు- ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు రూ.100.
0 Comments:
Post a Comment