స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC 1564 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సబ్ ఇన్‌స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) పోస్టుల్ని భర్తీ చేయనుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి జూలై 16 వరకు చివరి అవకాశం ఉంది. నాలుగు దశల పరీక్షల ద్వారా ఈ పోస్టులకు ఎంపిక చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. పేపర్ 1, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్-PST / ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్-PET, పేపర్ 2, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు అన్ని దశల పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC సెంట్రల్ పోలీజ్ ఆర్గనైజేషన్-CPO పేపర్ 1 సిలబస్ చూస్తే ఈ ఎగ్జామ్ ఆన్‌లైన్‌లో ఉంటుంది.
మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. 2 గంటల సమయం ఉంటుంది. 50 ప్రశ్నల చొప్పున నాలుగు సెక్షన్లు ఉంటాయి.
మొదటి సెక్షన్‌లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, రెండో సెక్షన్‌లో జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్, మూడో సెక్షన్‌లో క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్, నాలుగో సెక్షన్‌లో ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ టాపిక్స్ ఉంటాయి. 50 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. ప్రశ్నా పత్రం ఆబ్జెక్టీవ్ మల్టిపుల్ ఛాయిస్ టైప్‌లో ఉంటుంది. ప్రతీ తప్పు సమాధానానికి 0.25 నెగిటీవ్ మార్కులు ఉంటాయి. పేపర్ 1 క్వాలిఫై అయినవారే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ / ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌కు ఎంపికవుతారు.
0 Comments:
Post a Comment