ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా లడఖ్ పర్యటనకు వెళ్లారు. లడఖ్‌లో ఇండియా, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో... అక్కడ పరిస్థితిని భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ హఠాత్తుగా లడఖ్‌లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిన్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ లడఖ్ పర్యటన వాయిదా పడిన తరుణంలో ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా ఇక్కడికి రావడం విశేషం. ప్రధానితో పాటు సైనిక ఉన్నతాధికారులు లడఖ్ చేరుకున్నారు. వారితో ఇక్కడి తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించనున్నారు. ఆయన స్వయంగా సైనికులతో మాట్లాడనున్నట్టు సమాచారం. సముద్ర మట్టానికి అత్యంత ఎత్తయిన ప్రాంతంలో ఉండే జంక్సర్ రేంజ్‌కు ప్రధాని వెళ్లినట్టు తెలుస్తోంది.
గాల్వన్ ఘటనలో గాయపడి లేహ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సైనికులను ప్రధాని మోదీ పరామర్శించనున్నారు. వారిలో మనోధైర్యం నింపనున్నారు.
సాధారణంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే లడఖ్ సరిహద్దు ప్రాంతాలకు ప్రముఖలు పెద్దగా వెళ్లరు. కానీ ప్రధాని నరేంద్రమోదీ మాత్రం ఈ విషయంలో ముందడుగు వేశారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులు తెలుసుకోవాలని నిర్ణయించారు. ఆ వెంటనే ఆకస్మికంగా లడక్‌లో ల్యాండ్ అయ్యారు. ఇప్పటికే చైనాకు ట్రేడ్ విషయంలో అనేక షాక్‌లు ఇస్తున్న భారత్... సరిహద్దుల్లో ధీటైన జవాబు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉందనే సంకేతాలు పంపేందుకే ప్రదాని నరేంద్రమోదీ లడఖ్‌లో పర్యటిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

0 Comments:
Post a Comment