New Delhi: Prime Minister Narendra Modi has said that India's fundamental principle in development and cooperation is to respect its partners. Development lessons are said to inspire themselves. That is why there are no restrictions on India's development and cooperation. It seems that the Prime Minister made these remarks indirectly for China.
దిల్లీ: అభివృద్ధి, సహకారంలో భారత దేశం ప్రాథమిక సూత్రం తమ భాగస్వాములను గౌరవించడనమేనని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అభివృద్ధి పాఠాలు తమకు ప్రేరణ ఇస్తాయని తెలిపారు. అందుకే భారత దేశ అభివృద్ధి, సహకారంలో ఎలాంటి ఆంక్షలూ ఉండవని పేర్కొన్నారు. పరోక్షంగా చైనానుద్దేశించి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగనౌత్తో కలిసి ఆ దేశంలోని సుప్రీం కోర్టు భవనాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ గురువారం ప్రారంభించారు. స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజీలో భాగంగా ఈ భవన నిర్మాణానికి భారత్ ఆర్థిక సాయం చేసింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి ముఖ్య మూలస్తంభాలైన స్వతంత్ర న్యాయవ్యవస్థలను భారత్, మారిషస్ గౌరవిస్తాయని అన్నారు.
మారిషస్‌లో నూతనంగా నిర్మించిన సుప్రీం కోర్టు భవనం నిర్మాణం, ఆకృతి వాటి గౌరవానికి ప్రతీకలని తెలిపారు. హిందూ మహా సముద్రంలో భారత్‌కు మారిషస్ ముఖ్య భాగస్వామి అని, అందుకే భారత్ సాగర్ (సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రిజీయన్) ప్రణాళిక గురించి ముందుగా మారిషస్‌తో చర్చించినట్లు తెలిపారు.
అలానే కరోనా మహమ్మారి కట్టడిలో సమర్థంగా వ్యవహరిస్తున్నందుకు ఆ దేశ ప్రభుత్వానికి, ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. వైరస్‌పై పోరులో భాగంగా మందుల సరఫరాతో పాటు దానికి సబంధించిన సమాచారాన్ని భారత్ మారిషస్‌తో పంచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. అఫ్గానిస్థాన్ పార్లమెంట్ భవనం నిర్మాణానికి సాయం చేయడం భారత్ గౌరవంగా భావిస్తుందని, అలానే నైజీరియాలో మహాత్మ గాంధీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించడం భారత్‌కు గర్వకారణమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు.
అంతకుముందు కరోనా కట్టడికి సాయం చేసినందుకు మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగనౌత్ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ''గౌరవ మోదీజీ, మీరు చేసిన సాయానికి మా దేశం, మా ప్రజల తరఫున కృతజ్ఞతలు'' అని హిందీలో తెలిపారు. నూతనంగా నిర్మించిన సుప్రీం కోర్టు బిల్డింగ్ మారిషస్ దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు.
0 comments:
Post a comment