Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

 • Spoken English-books,Material NEW...
 • MORE TO VIEW

Thursday, 30 July 2020

5వ తరగతి వరకు మాతృభాషే.. నూతన విద్యా విధానంలో 10 ముఖ్యమైన అంశాలు

Mother tongue till 5th class .. 10 important elements in the new education system
 The center has radically purged the education system.  The Union Cabinet has approved the new education policy, ending the 30-year-old education policy.  Many revolutionary changes were made in it.  Education is compulsory for 3 to 18 year olds under the Right to Education Act.  Education will be done in the mother tongue till 5th standard.  The Center said the main objective of the new education policy was to reduce the burden of lessons on students, with the aim of providing education to all.

5వ తరగతి వరకు మాతృభాషే.. నూతన విద్యా విధానంలో 10 ముఖ్యమైన అంశాలు
విద్యావ్యవస్థను సమూల ప్రక్షాళన చేసింది కేంద్రం. 30 ఏళ్ల నాటి విద్యా విధానాన్ని స్వస్తిచెప్పి కొత్త విద్యా విధానానికి కేంద్రకేబినెట్ ఆమోద ముద్రవేసింది. ఇందులో ఎన్నో విప్లవాత్మక మార్పులు చేశారు. విద్యా హక్కు చట్టం కింద 3 నుంచి 18 ఏళ్ల వరకు విద్యను తప్పనిసరి చేశారు. 5వ తరగతి వరకు మాతృభాషలోనే విద్యా బోధన చేయనున్నారు. అందరికీ విద్య అందించాలన్న లక్ష్యంతో పాటు విద్యార్థులపై పాఠాల భారం తగ్గించాలన్నే నూతన విద్యా విధానం ముఖ్య ఉద్దేశ్యమని కేంద్రం తెలిపింది.

నూతన విద్యా విధానానికి సంబంధించి 10 ముఖ్యమైన అంశాలు1. ఐదవ తరగతి వరకు మాతృభాషలోనే విద్యాబోధన. ఏ విద్యార్ధిపైనా ఏ భాషనూ బలవంతంగా రుద్దరు. NEP 2020 (జాతీయ విద్యా విధానం) ప్రకారం సంస్కృతం భాష అన్ని స్థాయిల్లోనూ అందుబాటులో ఉంటుంది.
విదేశీ భాషలను మాత్రం సెకండరీ స్ధాయి నుంచి బోధిస్తారు.

2. హిందీని తప్పనిసరి చేయాలన్న NEP ముసాయిదాపై దక్షిణాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు జరగడంతో కేంద్రం వెనక్కి తగ్గింది. ఈ క్రమంలోనే 5వ తరగతి వరకు తప్పనిసరిగా మాతృభాషలోనే విద్యను బోధించాలని నిర్ణయించింది.

3.గతంలో ఉన్న 10+2 స్థానంలో 5+3+3+4ను అమలు చేయనున్నారు. మొదటి ఐదేళ్లను ఫౌండేషన్ కోర్సు(3 ఏళ్ల వయసు నుంచి 8 ఏళ్ల వరకు), ఆ తరువాత మూడేళ్లను ప్రీ ప్రైమరీ స్కూల్ (8 ఏళ్ల వయసు నుంచి 11 వరకు), ఆ తర్వాత మూడేళ్లను ప్రిపరేటరీ స్టేజ్ (11 ఏళ్ల నుంచి 14 వరకు), ఆ తర్వాతి నాలుగేళ్లను సెకండరీ స్టేజ్‌ (14 ఏళ్ల వయసు నుంచి 18 వరకు)గా పరిగణిస్తారు.

4. ప్రతి సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించరు. 3, 5, 8 తరగతుల వారికి పరీక్షలు ఉంటాయి. నైపుణ్యాలు పెంచుకునేలా పోటీ పరీక్షలను నిర్వహిస్తారు.

5. 10, 12వ తరగతుల విద్యార్థులకు ఎప్పటిలానే బోర్డు పరీక్షలు నిర్వహించినప్పటికీ.. పరీక్షల విధానంలో పూర్తిగా మార్పులు చేస్తారర.6. విద్యార్థులపై పాఠ్యాంశాల భారాన్ని తగ్గిస్తారు. ఒకరకమైన సబ్జెక్టు, భాషపై కాకుండా వివిధ అంశాలు, భాషల్లో పట్టు సాధించేలా కొత్త విద్యా విధానాంలో మార్పులు చేశారు.

7. ఐఐటీ వంటి ఉన్నత విద్యా సంస్ధల్లోనూ మార్పులు. 2050 నాటికి ఐఐటీ వంటి సంస్థల్లోనూ ఆర్ట్స్, మానవ విజ్ఞాన శాస్త్రాలులను చేర్చుతారు. సైన్స్ చదివే విద్యార్థులు ఆర్ట్స్ చదువుకోవచ్చు. ఆర్ట్స్ చదివే విద్యార్థులు సైన్స్ చదువుకోవచ్చు.

8. డిప్లొమా కోర్సు రెండేళ్లు, వృత్తి విద్య కోర్సు వ్వవధి ఏడాదిగా నిర్ణయించారు. అలానే డిగ్రీ కోర్సు కాల వ్యవధి మూడు లేదా నాలుగేళ్లుగా మార్పు చేయనున్నారు.

9. ఉన్నత విద్యను నియంత్రించడానికి 'హయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా' (HECI) ఏర్పాటు చేస్తారు. 3వేల మంది కంటే ఎక్కువ విద్యార్థులున్న సంస్థలపై HECI దృష్టి పెడుతుంది.

10. HECI కింద నాలుగు ఇండిపెండెంట్ వర్టికల్స్ ఉంటాయి. నియంత్రణ కోసం నేషనల్ హైయర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్ ఫర్ రెగ్యులేషన్, ప్రమాణాల రూపకల్పన కోసం జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఫండింగ్ కోసం హైయర్ ఎడ్యుకేషన్ గ్రాంట్స్ కౌన్సిల్, అక్రిడేషన్ కోసం నేషనల్ అక్రిడేషన్ కౌన్సిల్ ఏర్పాటు కానున్నాయి.

0 comments:

Post a comment

Teachers INFO

 • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
 • CLICK FOR MORE

Teachers News,Info

 • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
 • CLICK FOR MORE
  Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

 • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
 • CLICK FOR MORE
  TLM For Primary Classes( 1 to 5th ) subject wise
  TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top