In the wake of the corona boom in Madhya Pradesh, the state government has launched an innovative scheme called Mera Ghar Mera Vidyalaya to accommodate students in grades one to eight studying in government schools at home.
మధ్యప్రదేశ్‌లో కరోనా విజృంభణ నేపథ్యంలో సర్కారీ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి 8వ తరగతి విద్యార్థులు ఇంట్లోనే చదువుకునేలా వసతులు కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మేరా ఘర్ మేరా విద్యాలయ అనే వినూత్న పథకాన్ని ప్రారంభించింది. ఇంట్లోనే పాఠశాల వాతావరణం కల్పించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. పిల్లలు ఇంట్లో నుంచే ఆన్‌లైన్‌లో తరగతులు వినొచ్చు. పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థుల ఇళ్లకే వెళ్లి పుస్తకాలు, స్టడీ మెటీరియల్ అందజేస్తారు. ఉదయం విద్యార్థుల ఇంట్లో బెల్ వెూగగానే ఉపాధ్యాయులు తరగతులు ప్రారంభిస్తారు. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పిల్లలు చదువుకోవాలి. ఈ సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు వారికి ఎలాంటి ఇంటి పనులు అప్పగించొద్దు.
సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఆటలు ఆడుకోవచ్చు. సాయంత్రం 7 గంటల నుంచి 8 గంటల వరకు నైతిక విలువలతో కూడిన కథలు వినాల్సిందిగా టైం టేబుల్ నిర్ణయించారు. పథకానికి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి మంచి స్పందన వస్తుందని భోపాల్‌కు చెందిన ఉపాధ్యాయుడు ప్రభాకర్ చౌదరి తెలిపారు.

0 Comments:
Post a Comment