నార్తర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్-NCL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 495 ఖాళీలను ప్రకటించింది. మైనింగ్ సిర్దార్, సర్వేయర్, అకౌంటెంట్, జూనియర్ కెమిస్ట్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూలై 17న ప్రారంభం కానుంది. అప్లై చేయడానికి జూలై 23 చివరి తేదీ. వాస్తవానికి ఈ పోస్టులకు గతంలోనే దరఖాస్తుల్ని స్వీకరించింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. లాక్‌డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మళ్లీ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభిస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://nclcil.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 495
మైనింగ్ సిర్దార్- 88
సర్వేయర్ (మైనింగ్)- 7అకౌంటెంట్ / కాస్ట్ అకౌంటెంట్ టెక్ గ్రేడ్ ఏ- 41
ఓవర్సీర్ గ్రేడ్ సీ- 35
అమిన్ గ్రేడ్ డీ- 10
జూనియర్ కెమిస్ట్- 7
డ్రాగ్‌లైన్ ఆపరేటర్ (ట్రైనీ)- 9
డోజర్ ఆపరేటర్ (ట్రైనీ)- 48
గ్రేడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 11
డంపర్ ఆపరేటర్ (ట్రైనీ)- 167
షోవెల్ ఆపరేటర్ (ట్రైనీ)- 28
పే లోడర్ ఆపరేటర్ (ట్రైనీ)- 6
క్రేన్ ఆపరేటర్ (ట్రైనీ)- 21
డ్రిల్ ఆపరేటర్ (ట్రైనీ)- 17
దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 17
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 23
అర్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
http://nclcil.in/
0 Comments:
Post a Comment