భారతదేశంలో నెంబర్ 1 టెలికాం కంపెనీగా రిలయెన్స్ జియో ఘనత సాధించింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా-TRAI లెక్కల ప్రకారం 2020 మార్చిలో రిలయెన్స్ జియో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్-BSNL యూజర్లు పెరిగారు. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా యూజర్లు తగ్గారు. మార్చిలో రిలయెన్స్ జియోలో కొత్తగా 47 లక్షల సబ్‌స్క్రైబర్లు చేరితే, బీఎస్ఎన్ఎల్‌కు 95,428 సబ్‌స్క్రైబర్లు వచ్చారు. మరోవైపు వొడాఫోన్ ఐడియా 63 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, ఎయిర్‌టెల్ 12.6 లక్షల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్-MTNL 4,645 వేల సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. 33.47% మార్కెట్ షేర్‌తో రిలయెన్స్ జియో టాప్‌లో ఉంది. ఆ తర్వాత 28.31% మార్కెట్ షేర్‌తో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో, 27.57% మార్కెట్ షేర్‌తో వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో ఉంది. బీఎస్ఎన్ఎల్ మార్కెట్ షేర్ 10.35%. Jio Plans: 4జీ డేటా నుంచి ఉచిత కాల్స్ వరకు... జియో నుంచి బెస్ట్ ప్లాన్స్ ఇవే Jio offer: జియో యూజర్లకు ఉచితంగా డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్... ప్లాన్స్ ఇవే
ఇక 2020 మార్చి 31 నాటికి భారతదేశంలో 98.91 కోట్ల యాక్టీవ్ వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. టెలిఫోన్ సబ్‌స్క్రైబర్లు ఫిబ్రవరిలో 118 కోట్లు ఉంటే మార్చి 31 నాటికి 117 కోట్లకు తగ్గారు.
టెలీ డెన్సిటీ కూడా ఫిబ్రవరిలో 87.66% ఉంటే మార్చిలో 31 నాటికి కాస్త తగ్గి 87.37% చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో సబ్‌స్క్రైబర్ల సంఖ్య పెరిగింది. ఫిబ్రవరిలో 51.96 కోట్లు ఉంటే మార్చి నాటికి 52.15 కోట్లు ఉన్నారు. రూరల్ టెలీ డెన్సిటీ కూడా ఫిబ్రవరి 58.61% ఉంటే మార్చిలో 58.79% కావడం విశేషం. రూరల్ వైర్‌లెస్ డెన్సిటీ కూడా ఫిబ్రవరిలో 58.35% నుంచి మార్చిలో 58.54% చేరుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో వైర్‌లెస్ సబ్‌స్క్రైబర్లు ఫిబ్రవరిలో 51.73 కోట్లు ఉంటే మార్చిలో 51.92 కోట్లు కావడం విశేషం.
0 Comments:
Post a Comment