Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Sunday, 12 July 2020

inter -ఇంటర్ కాలేజీల పనిదినాలు కుదింపు.. సప్లిమెంటరీ రద్దు

It is unknown at this time what he will do after leaving the post.  College days are shrinking.  The unit examination system will be introduced in Intermediate.  Students are constantly assessing their abilities and preparing them for competitive exams.  A workbook will be given specifically for the subject.  These are designed with multiple choice questions and filling in the blanks in line with the JEE Main exams.

కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలీని పరిస్థితి. దీంతో కాలేజీ పనిదినాలు తగ్గిపోతున్నాయి. ఇంటర్మీడియట్ లో యూనిట్ పరీక్షల విధానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. విద్యార్థుల సామర్థ్యాలను నిరంతరం అంచనా వేయడంతోపాటు వారిని పోటీ పరీక్షలకు సంసిద్ధులను చేసేందుకు దీన్ని తీసుకొస్తున్నారు. సబ్జెక్టుకు ఒక వర్క్ బుకు ప్రత్యేకంగా ఇవ్వనున్నారు. జేఈఈ మెయిన్ పరీక్షలకు అనుగుణంగా బహుళైచ్ఛిక ప్రశ్నలు, ఖాళీలు నింపడం లాంటి ప్రశ్నలతో వీటిని రూపొందిస్తున్నారు.ఆగస్టు 3 నుంచి కళాశాలలను ప్రారంభించేలా ఇంటర్ విద్యాశాఖ ఈ ఏడాది అకడమిక్ క్యాలండర్-2021ను సిద్ధం చేసింది.కళాశాలల్లో ఉదయం సైన్సు, మధ్యాహ్నం ఆర్ట్స్ గ్రూపులకు తరగతులు నిర్వహిస్తారు.
తమ పరిస్థితులకు అనుగుణంగా కళాశాలలు వీటిని మార్పు చేసుకోవచ్చు.కళాశాలలు మొత్తం 196 రోజులు పని చేయనున్నాయి.సీబీఎస్ఈ తరహాలో 30% పాఠ్యాంశాలు తగ్గిస్తారు. రెండో శనివారమూ పని చేయాల్సి ఉంటుంది. పండగ సెలవులు ఒకట్రెండు రోజులు మాత్రమే ఉంటాయి.విద్యార్థులకు యూనిట్ పరీక్షలు ఉంటాయి. విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలకు వీడియోలను రూపొందిస్తారు.

మార్చిలోనే వార్షిక పరీక్షలు నిర్వహిస్తారు.అలాగే ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌-2020 పరీక్షల్లో ఫెయిలై అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసిన వారందరినీ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాసైనట్లుగా ఏపీ ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. వీరికి నిర్వహించాల్సిన అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు కోవిడ్‌-19 నేపథ్యంలో రద్దు చేసి అందరూ పాసైనట్టుగా ప్రభుత్వం ప్రకటించినందున అభ్యర్థులు ఫెయిలైన సబ్జెక్టులన్నిటికీ పాస్‌ మార్కులు వేస్తూ కంపార్టుమెంటల్‌ కేటగిరీలో పాస్‌ చేసినట్లు బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ తెలిపారు.అలాగే ఫస్టియర్‌ పరీక్షలు రాసిన అభ్యర్థులు మార్కుల ఇంప్రూవ్‌మెంట్‌ కోసం 2021 మార్చి/ఏప్రిల్‌లో నిర్వహించే పరీక్షల్లో రాసుకోవాలన్నారు. సెకండియర్‌ పరీక్షలతో పాటు ఫస్టియర్‌ సబ్జెక్టులకు ఇంప్రూవ్‌మెంట్‌ పరీక్షలకు హాజరుకావచ్చన్నారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top