దేశ ప్రజలను కాపాడేందుకు కుటుంబాలకు, దూరంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి సరిహద్దుల వద్ద గస్తీ కాస్తున్న ఆర్మీ జవాన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. వారి సేవలు విలువ కట్టలేనివి. సరిహద్దుల్లో అసామాన్య పరిస్థితుల్లో ఎలాంటి లగ్జరీ జీవితాన్ని ఆశించకుండా వారు విధులను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలాంటి వేడుకలకు కూడా వారు దూరంగా ఉంటుంటారు. ఇదిలా ఉంటే తన పుట్టినరోజు సందర్భంగా మంచును కేక్‌గా భావించి దాన్ని కట్ చేశారు ఓ సైనికుడు. ఈ సందర్భంగా పక్కనున్న మరికొందరు సైనికులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలను చెప్పారు.
ఇక ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన టీమిండియా మాజీ క్రికెటర్ సెహ్వాగ్..
'ఒక సైనికుడు తన పుట్టినరోజును ప్రకృతిలోని మంచు కేక్‌ను కట్ చేసి చేసుకున్నారు. సైనికుడికి తెలిసింది అదొక్కటే. వారి త్యాగాలను వర్ణించడానికి ఏ పదాలు సరిపోవు' అని కామెంట్ పెట్టారు.

0 Comments:
Post a Comment