Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Thursday, 2 July 2020

IBPS RRB 2020: బ్యాంకు ఉద్యోగాల జాతర... 9640 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్

IBPS RRB 2020: బ్యాంకు ఉద్యోగాల జాతర... 9640 పోస్టులతో ఐబీపీఎస్ నోటిఫికేషన్
బ్యాంకు ఉద్యోగాల జాతర మొదలైంది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS. రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది. డిగ్రీ, లా, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 జూల్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 21 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ https://www.ibps.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు. UPSC Jobs: ఇంటర్ పాసైనవారికి డిఫెన్స్, నేవీలో 413 జాబ్స్
మొత్తం ఖాళీలు- 9640
ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్)- 4624
ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్)- 3800
ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్-మేనేజర్)- 838ఆఫీసర్ స్కేల్-II (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్)- 59
ఆఫీసర్ స్కేల్-II (చార్టర్డ్ అకౌంటెంట్)- 26
ఆఫీసర్ స్కేల్-II (లా ఆఫీసర్)- 26
ఆఫీసర్ స్కేల్-II (ట్రెజరీ మేనేజర్)- 03
ఆఫీసర్ స్కేల్-II (మార్కెటింగ్ ఆఫీసర్)- 08
ఆఫీసర్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్)- 100
ఆఫీసర్ స్కేల్-III- 156
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 1
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 21
ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 జూలై 21
అప్లికేషన్ సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2020 జూలై 21
అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 5
కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2020 ఆగస్ట్ 12
ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2020 ఆగస్ట్ 24 నుంచి 29
ప్రిలిమినరీ పరీక్ష- 2020 సెప్టెంబర్ లేదా అక్టోబర్
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు- 2020 అక్టోబర్
మెయిన్ / సింగిల్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ లేదా నవంబర్
మెయిన్ / సింగిల్ ఫలితాల విడుదల- 2020 నవంబర్
ఇంటర్వ్యూ- 2020 నవంబర్

విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.
వయస్సు- ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ III పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ II పోస్టుకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ I పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు,.
ఎంపిక విధానం- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.
దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.180.

దరఖాస్తుకు ముందు యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు వివరాలు సిద్ధంగా ఉండాలి.
దరఖాస్తు సమయంలో పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్, క్వాలిఫికేషన్ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత https://www.ibps.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
హోమ్ పేజీలో Apply online for CRP RRBs IX లింక్ పైన క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వేర్వేరు లింక్స్ ఉంటాయి. మీరు అప్లై చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన లింక్ క్లిక్ చేయాలి.
మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
మీ వివరాలు ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి 'Final Submit' పైన క్లిక్ చేయాలి.
చివరగా పేమెంట్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.

1 comment:

  1. Oc candidate kuda fee taginchi estay andaru apply chasukovadaniki velu untadi oc 850rs another cast only 180 rs emina bagunda okaveyla job oc candidate ki vachina selete chairu anukunta entha different

    ReplyDelete

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top