సీజన్ మారుతున్నప్పుడు... ఆ వాతావరణానికి మనం వెంటనే అలవాడుపడం. కొన్ని రోజులు పడుతుంది. ఆ సమయంలో... రకరకాల వైరస్, బ్యాక్టీరియా మనపై దాడి చేస్తాయి. వాటిని తట్టుకునే శక్తిని మన బాడీ వెంటనే సమకూర్చుకోలేదు. ఈ లోగా జలుబు, జ్వరం, దగ్గు లాంటివి వచ్చేస్తాయి. కాలుష్యం కూడా మన ముక్కు, ఊపిరి తిత్తులను దెబ్బ తీస్తుంది. ఇలాంటప్పుడు మనం జాగ్రత్త పడాలి. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం గ్రీన్ టీ మనకు చక్కగా ఉపయోగపడుతుంది. పైగా ఈ టీ వల్ల అన్నీ లాభాలే. శరీరంలో విష వ్యర్థాలు బయటకు పోతాయి. అధిక బరువును తగ్గిస్తుంది. అందువల్ల రోజూ ఒకసారైనా గ్రీన్ టీ తాగితే... రకరకాల రోగాలు రాకుండా కాపాడుకోవచ్చు.
ఫ్రాన్షియర్స్ ఇన్ మైక్రోబయాలజీ పరిశోధకుల ప్రకారం...
గ్రీన్ టీలో అత్యంత ఎక్కువగా యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయి. అవి వైరస్‌తో పోరాడి మన శరీరానికి రక్షణ ఇస్తాయి. ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్స్... జలుబు, జ్వరం అంతు చూస్తాయి.
అంతేకాదు... గొంతులో గరగరను తగ్గించడంలో కూడా గ్రీన్ టీ సహకరిస్తుంది. గ్రీన్ టీ తాగడం కొంత మందికి ఇష్టం ఉండదు. అలాంటి వారు ఓ కప్పు కాఫీ తాగినా పర్వాలేదు అంటుంటారు.
అది నిజం కాదు. గ్రీన్ టీ... మన శరీరానికి కావల్సిన నీటిని (hydrating)... అందిస్తుంది.
అదే సమయంలో కాఫీ మన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. వైరస్‌లతో పోరాడాలంటే మన బాడీ హైడ్రేషన్ స్థితిలో ఉండాలి. అందువల్ల వ్యాధులతో పోరాడేందుకు గ్రీన్ టీ తాగితే మేలు.గ్రీన్ టీ ఎంత తాగాలి : గ్రీన్ టీ అనేది రోజుకు రెండు మూడు కప్పులు తాగొచ్చు. చక్కెర కలుపుకోకుండా తాగాలని డాక్టర్లు సూచిస్తారు.
చక్కెర బదులు తేనె కలుపుకొని తాగడం మేలు. కొంత మంది మద్యం తాగే అలవాటు ఉన్నవారు... నిద్రపోయే ముందు... గ్రీన్ టీలో కొద్దిగా బ్రాందీ కలుపుకొని తాగుతారు.
అందువల్ల టీ టేస్ట్ పెరగడమే కాదు... జలుబు తగ్గే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. బ్రాందీ వల్ల నిద్ర బాగా పడుతుంది. దగ్గు, జలుబు ఉన్నప్పుడు సరిగా నిద్ర పట్టదు.
అలాంటప్పుడు ఇది బాగా సెట్టవుతుంది. ఇంకా కావాలంటే... గ్రీన్ టీలో నిమ్మరసం కలుపుకొని తాగితే... విటమిన్ సీ కూడా లభించి... ఇన్ఫెక్షన్లతో బాగా పోరాడేందుకు వీలవుతుంది.

0 Comments:
Post a Comment