చాలామంది చల్లగా ఉండే నీళ్లను తాగేందుకు ఇష్టపడుతుంటారు. అవి ఆరోగ్యానికి అంట మంచివి కాదు. కరోనా కాలంలో అసలు మంచిది కాదు. ప్రతి రోజు తప్పనిసరిగా కాచిన నీళ్లను మాత్రమే తీసుకోవాలి. ఇలా వేడి నీళ్లను తీసుకోవడం వలన రోగాలు దరిచేరవని నిపుణులు చెప్తున్నారు. వేడి నీటిని రోజు తీసుకోవడం వలన శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో తెలుసుకుందాం.
కడుపునొప్పి, జీర్ణసంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇక అధికబరువు, ఊబకాయం నుంచి బయటపడాలంటే రోజు గోరువెచ్చని వేడినీళ్లు తాగాలి. కీళ్ల నొప్పులు ఉన్నవారు గోరువెచ్చని నీళ్లు తాగితే ఆర్థరైటిస్ నుంచి బయటపడొచ్చు. ఇక దగ్గు, జలుబు ఉన్న వ్యక్తులు గోరు వెచ్చని నీరు తీసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
అంతేకాదు, వేడి నీళ్లు శరీరంలో రక్తప్రసరణను పెంచుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎండాకాలంలో గోరు వెచ్చని వేడినీరు తాగితే డీహైడ్రేషన్ సమస్య నుంచి బయటపడొచ్చు. ఉదయాన్నే లేచిన తరువాత గోరు వెచ్చని నీటిని తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
0 comments:
Post a comment