ఏపీలో ప్రైవేట్ పాఠశాలలు, అన్ ఎయిడెడ్ స్కూల్స్ యాజమాన్యాలకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చిన వీర భద్రుడు కీలక ఆదేశాలు జారీచేశారు. రీజినల్ జాయింట్ డైరెక్టర్ లు, డి ఈ ఓ లు ప్రత్యేక నిబంధనల అమలు చేయాలని ఆదేశాలిచ్చారు. ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల యాజమాన్యాలు ఎలాంటి పరీక్షలు నిర్వహించకూడదని, విద్యార్థులకు మార్కులు, ర్యాంకులు ఇవ్వకూడదని సూచించారు. ఇదిలా ఉంటే ఎన్ సీఈఆర్ టీ ప్రత్యామ్నాయ విద్య సంవత్సర క్యాలెండర్ ను సిద్దం చేసింది. ఈ విద్యా సంవత్సరం క్యాలండర్ ను పాటించాలని అన్ని స్కూళ్లకు ఆదేశాలిచ్చారు. ఆన్ లైన్ అభ్యాసం కొనసాగించడాన్ని ప్రోత్సహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
ప్రస్తుతం వున్న పరిస్థితుల్లో విద్యాసంవత్సరం ఎప్పుడు ప్రారంభించాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కరోనా వైరస్ వ్యాపిస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో అమలవుతున్న విధానాలపై నిఘా పెట్టనున్నారు. ప్రైవేట్ పాఠశాలల యజమానులు ఆన్ లైన్ క్లాస్ లు నిర్వహించి ఫీజులు చెల్లించమంటున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని పాఠశాలలు విద్యార్థులకు టెస్ట్ లు పెట్టి మార్కులు, ర్యాంకులు ఇస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, రాష్ట్రంలో ఇంకా అకడమిక్ క్యాలెండర్ తయారుకాలేదన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ చినవీరభద్రుడు.పాఠశాలల పనిదినాలు, సిలబస్ తగ్గింపు ద్వారా విద్యార్థుల అభ్యాసంపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఎన్ సి ఈ ఆర్ టి ఇప్పటికే అకడమిక్ క్యాలెండర్ ను అన్ని స్థాయి విద్యార్థులకు తయారు చేస్తోందని, టీచర్లు, సోషల్ మీడియా సాయం తో అకడమిక్ విద్యను పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యేవరకు విద్యార్థులకు అందించాలన్నారు. ఇప్పుడు ఎన్ సి ఈ ఆర్ టి 8రకాల ప్రత్యామ్నాయ క్యాలెండర్ ను ప్రాథమిక విద్య కోసం విడుదల చేసింది.

Please share SCERT calender
ReplyDelete