ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి శుభవార్త. భారతీయ స్టాక్ మార్కెట్ల రెగ్యులేటరీ సంస్థ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా-SEBI 147 ఖాళీలను భర్తీ చేస్తోంది. జనరల్, లీగల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, రీసెర్చ్, అఫీషియల్ లాంగ్వేజ్ స్ట్రీమ్‌లో గ్రేడ్ ఏ (అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల్ని ప్రకటించింది. వాస్తవానికి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ గతంలోనే ముగిసింది. కానీ కరోనా వైరస్ సంక్షోభం కారణంగా దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది సెబీ. లాక్డౌన్ ఆంక్షల్ని సడలించడంతో మరోసారి దరఖాస్తు ప్రక్రియ మొదలుపెట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు 2020 జూలై 31 వరకు దరఖాస్తు చేయొచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sebi.gov.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు- 147
జనరల్- 80
లీగల్- 34
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 22ఇంజనీరింగ్- 5
రీసెర్చ్- 5
అఫీషియల్ లాంగ్వేజ్- 1
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 7
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 31
దరఖాస్తులు ఎడిట్ చేయడానికి చివరి తేదీ- 2020 జూలై 31
దరఖాస్తు ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 15
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
వయస్సు- 2020 ఫిబ్రవరి 29 నాటికి 30 ఏళ్లు.
ఎంపిక విధానం- ఫేజ్ 1, ఫేజ్ 2 ఎగ్జామ్స్, ఇంటర్వ్యూ.
పరీక్షా కేంద్రాలు- ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూల్, రాజమండ్రి, గుంటూరు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్.
దరఖాస్తు ఫీజు- అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.
0 comments:
Post a comment