Search This Blog

FLASH NEWS ⚡⚡⚡ ఫ్లాష్ న్యూస్...

  • Spoken English-books,Material NEW...
  • MORE TO VIEW

Saturday, 11 July 2020

Fake SBI Branch -వెలుగులోకి ఎస్‌బీఐ నకిలీ బ్రాంచ్‌ బాగోతం-3నెలల పాటు సాఫీగా సాగిన కార్యకలాపాలు కస్టమర్‌ ఫిర్యాదుతో బయటపడ్డ ఉదంతం

The three men jointly set up a fake SBI branch. The incident took place in Panruti taluka of Cuddalore district in Tamil Nadu. The fake branch affair, which went smoothly for 3 months, finally came to light with an SBI customer complaint.
3నెలల పాటు సాఫీగా సాగిన కార్యకలాపాలు
కస్టమర్‌ ఫిర్యాదుతో బయటపడ్డ ఉదంతం
నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

బ్యాంకులకు కన్నాలు వేసే దొంగల గురించి తెలుసు. పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పరారీ అయ్యే ప్రబుద్ధుల గురించి తెలుసు. రొటీన్‌గా మోసాలు చేస్తే కిక్‌ ఏముంటుది అనుకున్నారో ఏమో... ముగ్గురు వ్యక్తులు ఏకంగా నకిలీ ఎస్‌బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్‌రూటి తాలుకాలో చోటు చేసుకుంది. 3నెలల పాటు సాఫీగా సాగిన ఈ నకిలీ బ్రాంచు వ్యవహారం చివరికి ఓ ఎస్‌బీఐ కస్టమర్‌ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురిలో ప్రధాన సూత్రధారి కమల్‌బాబు.
తల్లి బ్యాంకు మాజీ ఉద్యోగి. ఓ పేరుమోసిన బ్యాంకులో పనిచేసి రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. తండ్రి పదేళ్ల కిందట చనిపోయారు. మరో వ్యక్తి ప్రింటింగ్‌ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. మూడో వ్యక్తి రబ్బర్‌ స్టాంప్‌లను తయారీ చేస్తున్నారు.

బాగోతం బయట పడిందిలా: ఎస్‌బీఐ కస్టమర్‌ ఒకరికి ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చి స్థానిక బ్రాంచ్‌ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. సదరు మేనేజర్‌ ఈ సమాచారాన్ని జోనల్‌ ఆఫీసుకు తెలియజేశారు. ఎస్‌బీఐకు సంబంధించి పన్‌రూటీలో కేవలం 2బ్రాంచులకు మాత్రమే అనుమతులున్నాయని మూడోది బ్రాంచ్‌ నకిలీదని జోనల్‌ అధికారులు నిర్ధారించారు. నకిలీ బ్రాంచును సందర్శంచి అందులో సోదాలు నిర్వహించారు. అదృష్టవశాత్తు ఈ బ్రాంచు నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల రూపకల్పన చూసి అధికారులు విస్తుపోయారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఇంకేంముంది కటకటాల్లోకే: సమాచారం అందుకున్న పన్‌రూటీ పోలీసులు ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ అంబేద్కర్‌ తెలిపారు.

0 comments:

Post a comment

Teachers INFO

  • SCERT - OFFICIAL - 10th class new pattern Model papers Latest
  • CLICK FOR MORE

Teachers News,Info

  • CCE Formative Assessment Tools and Guidelines for FA1, FA2, FA3, FA4 in AP Schools,FA Model papersLatest
  • CLICK FOR MORE
    Acadamic Reated Lables

District wise info

More
AP District wise updates

Pimary Classes TLM,Material

  • June Month Syllabus - 1 to 5th Telugu / English RhymesLatest
  • CLICK FOR MORE
    TLM For Primary Classes( 1 to 5th ) subject wise
    TLM For Class wise

High school -TLM,Material

CLICK FOR More

TLM @ High school classes(6 to 10th)Subject Wise
TLM , Studyy Material For High school classes

General Issues

CLICK FOR MORE
General Lables

Students Related Info

CLICK FOR MORE
STUENTS INFORMATION LABLES

AP District wise Updates

More
AP District wise updates

Follow by Email

To get updates from aptnusinfo.blogspot.com to your Email directly,Enter your email id and click submit button,Then a popup windo will open,then type the Captcha code,Then go t your mail inbox,a confirmation mail will be there, verify that.Next onwards when ever i post a new one automatically a mail will be sent you.
Top