✍ESR ఇక్కట్లు...
అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సమాచారాన్ని ఆన్లైన్ చేసేందుకు ప్రారంభించిన ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్ (ఈ ఎస్సార్) నమోదు కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటు న్నారు. రాష్ట్రంలోని అన్ని విభాగాల సమాచారాన్ని కార్యకలాపాలను కాగిత రహితం చేసేందుకు ఈ ఎస్పార్ వ్యవస్థను ప్రవేశపెడుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.అందులో భాగంగా ఉద్యోగుల సర్వీస్, సెలవులు ఇంక్రిమెంట్లు, వ్యక్తిగత సమాచారం తదితర 11 రకాల అంశాలను ఆన్లైన్లో నమోదు చేయాలని ప్రత్యేక వెట్ సైట్ ఏర్పాటు చేసింది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇంటర్నెట్ సదుపాయం పూర్తి సమయం అందుబాటులో లేక సర్వర్ పని చేయకపోవడం, ఉద్యోగులు నమోదు చేయాల్సిన అంశాలు ఎక్కువగా ఉండటం, ఇతర ప్రభుత్వ కార్యక్రమాల వల్ల పూర్తిగా నమోదు చేసిన వారి సంఖ్య అంతంతమాత్రం గానే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం లోని వివిధ శాఖల ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఈ ఎస్సార్ నమోదు గడువును ఆగస్టు 31 వరకైనా పొడిగించాలని కోరుతున్నాయి.
♦పూర్తయిన శాతం దాదాపుగా 'సున్నా'
రాష్ట్రంలో ఈ ఎస్సార్ నమోదు చేయాలని మే ఒకటిన ప్ర భుత్వం ఆదేశించింది. రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులకు సర్వీసుపరమైన సమస్యలు తలెత్తకుండా ప్రతి నెలా ఒకటో తేదీ కంచి వేతనాలు జారీ చేయడం, ఉద్యోగ విరమణ సమయంలో అన్ని రకాల బెనిఫిట్స్ అందించేలా ఈ ఎస్సార్ఉపయోపడుతుంది. అందుకోసం హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్(హెచ్ఆర్ఎంఎస్) స్థానంలో హ్యుమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (హెచ్ సీఎం) అనే నూతన విధానాన్ని జూన్ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఐదు లక్షల 77 వేల మందికి పైగా ఉద్యోగులు, అధికారుల వివరాలను ఈ ఎస్సార్ లో నమోదు చేయాలని ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు అన్ని దశల్లో సమాచారం అప్లోడ్ చేయడంతో పాటు డీడీవో బయోమెట్రిక్ పూర్తి చేసుకున్న ఉద్యోగుల సంఖ్య వందలోపే ఉంది. జూన్ 15లోగా ఈ ఎస్సార్ నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఇప్పటి వరకు 'సున్నా' శాతమే పూర్తయింది. అలాగే డేటా ఎంట్రీ వర్క్ ప్రారంభించిన వారి సంఖ్య 8 వేల 676, డేటా ఎంట్రీ పూర్తయిన సంఖ్య 1128 గా ఉంది.
♦విద్యాశాఖలో మరీ దారుణం
రాష్ట్రవ్యాప్తంగా కరోనా లో డౌన్ కారణంగా ఇంటర్నెట్ సెంటర్లు పూర్తి సమయం అందుబాటులో లేకపోవడం, అందు బాటులో ఉన్న కొద్ది సేపట్లో సర్వర్ సరిగా పని చేయకపో వడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఈ ఎస్సార్ నమోదుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొత్తం లక్షా 76 వేల 138 మంది ఉపాధ్యాయులు ఉండగా. డీడీవో బయో మెట్రిక్ పూర్తి చేసుకున్న వారి సంఖ్య కేవలం ఐదుగా ఉంది. ప్రభుత్వం, విద్యాశాఖ నిర్దేశిం చిన జూన్ 15 గడువు ముగిసి నెల దాటు తున్నా.. నమోదు మాత్రం ప్రారంభ దశలోనే ఉంది. ఈ నేపథ్యంలో నమోదు గడువును కనీసం మూడు నెలలు లేదా ఆగస్టు 31 వరకు విద్యా సంవత్సరం ప్రారంభు అయ్యే వరకు పొడిగించాలని ఉద్యోగులు కోరుతున్నారు
♦మొత్తం 11 రకాల వివరాలు
ఈ ఎస్సార్ నమోదు కోసం ఉద్యోగ ఉపాధ్యాయులు 11 రకాల వివరాలు అప్లోడ్ చేయాల్సి ఉంది. వ్యక్తిగత వివరాలు, విద్యార్హతల సర్టిఫికెట్లు, సర్వీస్ వివరాలు జీతభత్యాల వివరాలు, సెలవుల వివరాలు, ఇన్సూరెన్స్ ట్రావెల్ కన్సెషన్, అడ్వాన్సులు, సర్వీస్ వెరిఫికేషన్ డిపార్టమెంటల్ పరీక్షలు, శిక్షణలు, ఇన్సెంటివ్స్. పనిష్మెంట్ తదితర 11 కాలమ్స్ పూర్తి చేయాల్సి ఉంది. వీటిలో ఒక్కొక్క కాలం అదనపు ఆప్షన్స్ ఉండటంతో సర్వర్ సరిగా పనిచేయక తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఒక్క కాలమ్ పూర్తి చేయడానికే దాదాపు గంటకు పైగా సమయం పడుతుంది లాక్ డౌన్ వల్ల నెట్ సెంటర్ అందుబాటులో లేకనమోదుపూర్తి చేయడం సాధ్యం కావడం లేదని ఉపాధ్యాయ సంఘాల నేత లు చెబుతున్నారు.

0 Comments:
Post a Comment