#COVIDUpdates: 03/07/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 14,414 పాజిటివ్ కేసు లకు గాను
*6,126 మంది డిశ్చార్జ్ కాగా
*206 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 8,082
#APFightsCorona
ఏపీలో 837 కరోనా కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 38,898 మంది నమూనాలు పరీక్షించగా 837 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. అయితే, వీటిలో విదేశాలకు చెందిన ఇద్దరు, పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన 46 కేసులు ఉండగా.. రాష్ట్రంలో 789 పాజిటివ్ కేసులు వచ్చాయి. పొరుగు దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 16,934 కేసులు నమోదయ్యాయి. కొవిడ్ కారణంగా గడచిన 24 గంటల్లో కర్నూలు జిల్లాల్లో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 206 చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 7,632కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్ ఆసుపత్రుల్లో 9096 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొవిడ్ కేసులు మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 9,71,611 శాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
జిల్లాల వారీగా కేసుల వివరాలు..
ఏపీలో 837 కరోనా కేసులు
0 Comments:
Post a Comment