ఉద్యోగుల్లో కరోనా గుబులు
ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తరిస్తున్న వైరస్
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా తప్పని వ్యాప్తి
భయంభయంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది
ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటి వరకు సచివాలయం, శాఖల విభాగాధిపతుల కార్యాలయాలు, మంత్రుల పేషీల్లోని సిబ్బందికి కరోనా సోకగా.. తాజాగా ఇది జిల్లా కార్యాలయాలు, రెవెన్యూ డివిజన్లు, మండల కార్యాల యాలకూ వ్యాపిస్తోంది. దీంతో అధికారులు, ఉద్యోగులు సిబ్బంది భయంతో వణుకుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటు న్నప్పటికీ కరోనా వైరస్ ఏదో ఒక రూపంలో చాప కింద నీరులా విస్తరిస్తుండటంతో బెంబేలెత్తిపోతున్నారు. కొన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాల్లో కరోనా కలకలం రేపుతోంది. కొందరు ఉద్యోగులు అనారోగ్యానికి గురి కావడంతో వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు, తోటి ఉద్యోగులు భయాం దోళనలకు గురవుతున్నారు. అన్ని విభాగాల్లో శానిటైజేషన్ చేయడం తోపాటు మాస్కులు, శానిటైజర్లు వినియోగిస్తున్న. ఏదో ఒక రూపంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ముఖ్యంగా జిల్లాల్లో పాలనా వ్యవహారాలు పర్యవేక్షించే కలెక్టర్ కార్యాలయాల్లో నిత్యం అనేక సమీక్షలు, సమావేశాలు జరగడం సహజం. ఈ సమావేశాలకు జిల్లాలోని ప్రధాన అధికారుల తోపాటు, ఇతర అధికార యంత్రాంగం కూడా హాజరవుతుంటారు.
వీరంతా వివిధ ప్రాంతాల నుంచి సమావేశాలకు హాజరు కావడం మరోవైపు వినతులు, సమస్యలు తెలుపుకొనేందుకు జిల్లావ్యాప్తంగా ఎన్నో చోట్ల నుంచి ప్రజలు వస్తుండటంతో కరోనా కట్టడి కష్టసాధ్యంగా మారుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో వచ్చే వారందరికీ థర్మల్ స్క్రీనింగ్ శానిటైజేషన్ చేస్తున్నప్పటికీ ఉద్యోగులు, సిబ్బంది కరోనా బారిన పడటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఒకవైపు ఉన్నతాధికారులు విధి నిర్వహణలో కోవిడ్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లో సందర్శకుల నుంచి వినతులు, ఇతర కార్యక్రమాల్లో ఉద్యోగులు భాగస్వాములవుతూ కరోనా బారిన పడుతున్నారు. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న కార్యాలయాల్లో సిబ్బందిని వర్క్ ఫ్రం హోం నిర్వహించే విధంగా ప్రభుత్వం అనుమతించినా.. కొన్ని ముఖ్య విభాగాల్లోని అధికారులు, సిబ్బంది కార్యాలయాల్లో ప్రత్యక్షంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇంకోవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ క్రమంలో సచివాలయ సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇదిలా ఉంటే గన్నవరం విమానాశ్రయ భద్రతా సిబ్బంది కూడా తాజాగా కరోనాకు గురయ్యారు. ఇంకొక వైపు రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో, జైళ్లలో సిబ్బంది కూడా వైరస్ బారిన పడుతుండటంతో తోటి సిబ్బంది ఉద్యోగ బాధ్యతలకు హాజరు కావాలంటే భయపడుతున్నారు.

0 Comments:
Post a Comment