కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ 19 హోమ్ ఐసోలేషన్ నియమనిబంధనల్ని సవరించింది. ఎలాంటి లక్షణాలు లేని కోవిడ్ 19 పాజిటీవ్ పేషెంట్లను హోమ్ ఐసోలేషన్ జాబితాలో చేర్చింది. కానీ సవరించిన గైడ్‌లైన్స్ ప్రకారం హెచ్ఐవీ, క్యాన్సర్ థెరపీ, ట్రాన్స్‌ప్లాంట్ రోగులకు రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారు హోమ్ ఐసోలేషన్‌కు అర్హులు కాదు. వీరితో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులు, ఇప్పటికే బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, శ్వాస సంబంధిత, ఊపిరితిత్తుల వ్యాధులు, లివర్, కిడ్నీ సమస్యల్లాంటి వ్యాధులు ఉన్నవారిని కూడా మెడికల్ ఆఫీసర్ అవసరమైన పరీక్షలు జరపకుండా హోమ్ ఐసోలేషన్‌కు అనుమతించరు. కరోనా వైరస్ లక్షణాలు ప్రారంభమైన 10 రోజుల తర్వాత, వరుసగా మూడు రోజుల పాటు జ్వరం లేకపోతే హోమ్ ఐసోలేషన్ నుంచి పేషెంట్లు డిశ్చార్జ్ అవుతారు.
పేషెంట్లు వారం రోజుల పాటు ఇంట్లోనే ఐసోలేషన్ కావడంతో పాటు ఆరోగ్యాన్ని స్వయంగా మానిటర్ చేసుకోవాలని సవరించిన గైడ్‌లైన్స్ సూచిస్తున్నాయి.
Coronavirus: ఆయుర్వేదంతో ఇమ్యూనిటీ పెంచుకోండి ఇలా... ఆయుష్ మంత్రిత్వ శాఖ టిప్స్ Food Tips: రోగనిరోధక శక్తిని పెంచే 9 ఆహార పదార్థాలివే...
కోవిడ్ 19 లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్నవారు హోమ్ ఐసోలేషన్ ఎంచుకోవచ్చు. అయితే సదరు పేషెంట్ల ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ కాకుండా సెల్ఫ్ ఐసోలేషన్ సదుపాయాలు ఉండాలి. కోవిడ్ 19 పేషెంట్లు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నన్ని రోజులు 24 గంటల పాటు సేవలు అందించడానికి కేర్‌గివర్ అంటే సంరక్షకులు అందుబాటులో ఉండాలి. కోవిడ్ 19 పేషెంట్, సంరక్షకులతో పాటు వారి క్లోజ్ కాంటాక్ట్స్ మెడికల్ ఆఫీసర్ సూచనల మేరకు హైడ్రాక్సిక్లోరోక్విన్ మెడిసిన్ ఉపయోగించాలి. దీంతో పాటు ఆరోగ్య సేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని నిత్యం బ్లూటూత్, వైఫై ఆన్‌లో ఉంచాలి. పేషెంట్లు తమ ఆరోగ్యాన్ని మానిటర్ చేసుకోవడంతో పాటు వివరాలను జిల్లా అధికారికి ఎప్పటికప్పుడు వెల్లడిస్తుండాలి.
0 Comments:
Post a Comment