భారత్‌లో కరోనా వాక్సిన్ ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ (COVAXIN) వాక్సిన్‌కు ఇప్పటికే DCGI అనుమతిచ్చింది. ఈ నెలలోనే మనుషులపై వాక్సిన్‌ను ప్రయోగించనున్నారు. అందుకోసం దేశవ్యాప్తంగా 12 కేంద్రాలను ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. అందులో తెలంగాణ, ఏపీలో ఒక్కో సెంటర్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో విశాఖలోని కేజీహెచ్, హైదరాబాద్ నిమ్స్‌లో క్లినికల్ ట్రయల్స్‌కు అనుమతి ఇచ్చింది. కేజీహెచ్‌లో వాక్సిన్ క్లినకల్ ట్రయల్స్‌కు నోడల్ అధికారిగా కేజీహెచ్ డాక్టర్ వాసుదేవ్‌ను నియమించారు. ఇక నిమ్స్‌లో వాక్సిన్ ట్రయల్స్‌కు డాక్టర్ ప్రభావకర్ రెడ్డిని నోడల్ అధికారిగా నియమించారు.
కొవాగ్జిన్ (COVAXIN)వాక్సిన్‌ను భారత వైద్య పరిశోధనా మండలి (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ భారత్ బయోటెక్ కంపెనీ తయారుచేసింది.
అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సీన్‌ను మనుషులపై ప్రయోగించేందుకు గాను ఫేజ్-1, ఫేజ్-2 క్లినికల్ ట్రయల్స్‌కు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI)అనుమతి ఇచ్చింది. జులైలో దేశవ్యాప్తంగా కొవాక్సిన్ ఔషద ప్రయోగాలు జరగనున్నాయి. ఈ క్రమంలో భారత్ బయోటెక్ కంపెనీకి ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ లేఖ రాశారు.
క్లినికల్ ట్రయల్స్‌ను వేగవంతం చేయాలని సూచించారు. మనుషులపై చేసే ప్రయోగాలు విజయవంతమైతే ఆగస్ట్ 15 నాటికి కొవాగ్జిన్ వాక్సిన్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని ICMR భావిస్తోంది. కాగా, భారత్‌లో కరోనావైరస్ అంతకంతకూ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 20,903 కొత్త కేసులు నమోదవగా..
మరో 379 మంది మరణించారు. మన దేశంలో ఇప్పటి వరకు 625,544 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 379,892 మంది కోలుకోగా.. 18,213 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 227,439 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
0 Comments:
Post a Comment