Research is underway worldwide for the corona vaccine. More than 20 vaccines are in the launch phase. Russia has already announced that it has successfully completed clinical trials. Recently, another piece of good news came from the United States. With the corona vaccine they have developed, American scientists have revealed that good results are coming as expected.
కరోనా వాక్సీన్ కోసం ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 20కి పైగా వాక్సీన్లు ప్రయోగ దశలో ఉన్నాయి. క్లినికల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తిచేశామని ఇప్పటికే రష్యా ప్రకటించగా.. తాజాగా అమెరికా నుంచి మరో శుభవార్త వినిపించింది. తాము అభివృద్ధి చేసిన కరోనా వాక్సిన్‌తో.. ఊహించిన విధంగానే మంచి ఫలితాలు వస్తున్నాయని అమెరికా శాస్త్రవేత్తలు వెల్లడించారు. తొలిదశ ప్రయోగాలు పూర్తై.. ఫైనల్ టెస్టింగ్ దశకు చేరుకుందని తెలిపారు. జులై 27 నుంచి ఫైనల్ టెస్టింగ్ ప్రక్రియ మొదలు పెడతామని పేర్కొన్నారు. ఈ దశంలో 30వేల మందిపై ప్రయోగాలు చేస్తామని వెల్లడించారు.
ఈ వాక్సీన్‌ను అమెరికా దిగ్గజ ఔషధ సంస్థ మోడర్నా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.
కరోనా వాక్సీన్ తీసుకున్న తొలి 45 మందిలో మంచి ఫలితాలు కనిపించాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వారు చెప్పిన వివరాల ప్రకారం.. వాక్సీన్ ఇచ్చిన తర్వాత కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీలు తయారయ్యాయి. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పెద్దగా లేవు. కొందరిలో మాత్రం ఫ్లూ లక్షణాలు కనిపించాయి. ఐతే వాంతులు, తలనొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు వంటి లేవు. నెలలో రెండు డోస్‌లు ఇవ్వాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఫైనల్ టెస్టింగ్ పూర్తైన తర్వాత ప్రజలకు అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
వాక్సీన్ తయారీని ప్రజలంతా ఒక పరుగు పందెంలా చూస్తున్నారు. ఎవరు గెలుస్తారా? అని ఆసక్తిగా గమనిస్తున్నారు. నేను, మా బృందం అందరినీ అభినందిస్తోంది. మనకు అనేక వ్యాక్సిన్లు రావాలి. మా ఒక్క దేశానికే కాదు. ప్రపంచం మొత్తానికి వాక్సిన్లు అందుబాటులో ఉండాలి. — డాక్టర్ ఫాచీ
కాగా, భారత్‌లోనూ కరోనా వాక్సీన్పై పరిశోధనలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్, జైడుస్ తయారు చేసిన జైకోవ్-డీ హ్యూమన్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి.

0 comments:
Post a comment