Cinnamon is one of the most popular spices. Some people eat it not only in spices but also separately. Its aroma and taste are so impressive. The inner bark of the cinnamon tree is called cinnamon. When removed from the tree, it wraps around and turns into tubes. They are called cinnamon sticks. They can also be boiled in water or powdered to make tea. Cinnamon tea has many medicinal properties.
సుగంధ ద్రవ్యాల్లో ఎక్కువ మందికి నచ్చేవాటిలో దాల్చిన చెక్క ఒకటి. కొంతమంది దాన్ని మసాలాలలో కాకుండా... విడిగా కూడా తింటుంటారు. దాని పరిమళం, టేస్ట్ అంతలా ఆకట్టుకుంటుంది. దాల్చిన చెట్టు లోపలి బెరడునే దాల్చిన చెక్క అంటాం. చెట్టు నుంచీ తీశాక అది గుండ్రంగా చుట్టుకొని గొట్టాలలాగా మారిపోతుంది. వాటినే సిన్నమోన్ స్టిక్స్ (దాల్చిన చెక్కలు) అంటారు. వాటిని అలాగే నీటిలో ఉడకపెడతారు లేదా పౌడర్‌గా చేసుకొని... టీ తయారు చేయవచ్చు. సిన్నమోన్ టీకి చాలా ఔషధ గుణాలున్నాయి. బరువు తగ్గాలన్నా, గుండె ఆరోగ్యంగా ఉండాలన్నా, పీరియడ్స్ సక్రమంగా జరగాలన్నా, కడుపులో మంటల వంటివి పోవాలన్నా, బీపీ కంట్రోల్‌లో ఉండాలన్నా దాల్చిన చెక్కతో తయారుచేసిన టీ తాగితే మంచిది.
నడుం చుట్టూ రింగులా ఉండే కొవ్వు కరిగిపోవాలంటే... దాల్చిన చెక్క టీ తాగాలన్నది నిపుణుల సలహా. త్వరగా ముసలి తనం రాకుండా ఉండాలనుకుంటే... కూడా ఈ టీ తాగితే సరి. చర్మం, ముఖంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ టీ తాగితే ప్రయోజనాలు బాగా ఉంటాయి.
దాల్చిన చెక్క టీలో యాంటీఆక్సిడెంట్స్, పాలీఫెనాల్స్ చాలా ఉంటాయి. అవి మన శరీరాన్ని రకరకాల వ్యాధులు సోకకుండా కాపాడతాయి. షుగర్, కాన్సర్, గుండె జబ్బులు, చర్మ కణాలు దెబ్బతినడం వంటి సమస్యలకు చెక్ పెడుతుంది ఈ టీ. మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో దాల్చిన చెక్క టీ చక్కగా ఉపయోగపడుతుంది. అదే సమయంలో మంచి కొవ్వును పెంచుతుంది. ఓవరాల్‌గా గుండెకు హాని జరగకుండా చేస్తుంది. బ్రెయిన్ బాగా పనిచెయ్యాలన్నా, మతిమరపుకి చెక్ పెట్టాలన్నా సిన్నమోన్ టీ తాగాల్సిందే. అలాగే... ఎయిడ్స్‌కి కారణమయ్యే HIV వైరస్‌తో పోరాడే శక్తి కూడా దాల్చిన చెక్కకు ఉందని కొన్ని పరిశోధనల్లో తేలింది.రోజూ 120 మిల్లీగ్రాముల దాల్చిన చెక్కతో (చెక్క లేదా పౌడర్) (టీ స్పూన్‌లో పదో వంతు పొడి)... ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చు. ఈ టీని వేడిగా, చల్లగా ఎలా తాగినా అవే ప్రయోజనాలు కలుగుతాయి.
దాల్చిన చెక్క టీ రుచి బాగుంది కదా అని ఎక్కువ తాగడం మంచిది కాదు. ఇవి రోజుకి రెండు కంటే ఎక్కువ టీలు తాగకూడదు. అలా తాగితే లివర్ సరిగా పనిచెయ్యదు. గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టదు.
ఓ కప్పు వేడి నీటిలో (235 ml వాటర్) ఓ టీ స్పూన్ (2.6 గ్రాములు) దాల్చిన చెక్క పొడి, సరిపడా చక్కెర వేసి కలపాలి. దాన్ని ఫిల్టర్ చేసి తాగేయడమే. లేదంటే... దాల్చిన చెక్కలను వేడి నీటిలో 10 నుంచీ 15 నిమిషాలు ఉంచి... ఆ నీరు తాగినా ప్రయోజనం ఉంటుంది. ప్రస్తుతం సూపర్ మార్కెట్లలో, ఆన్‌లైన్‌లో సిన్నమోన్ టీ బ్యాగులు కూడా దొరుకుతున్నాయి. వాటిని కొనుక్కొని తాగినా ప్రయోజనం ఉంటుంది.

0 Comments:
Post a Comment