He was the son of a poor farmer. However, he is bold in his studies. Incredible talent belongs to that guy. Satta topped the recently released CBSE Class XII results. He scored 98.2 percent. With this he achieved another feat. World-renowned, qualified to receive the prestigious Ivy League University Scholarship in America..
అతడు ఓ పేద రైతు కొడుకు. అయితేనేమి చదువులో మాత్రం దిట్ట. అద్భుతమైన ప్రతిభ ఆ కుర్రాడి సొంతం. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. ఏకంగా 98.2 పర్సెంట్ స్కోర్ చేశాడు. దీంతో అతడు మరో ఘనత సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, అమెరికాలోని ప్రతిష్టాత్మక Ivy League University స్కాలర్ షిప్ పొందేందుకు అర్హత సాధించాడు.
100కు 100 మార్కులు:
ఆ కుర్రాడి పేరు అనురాగ్ తివారి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్ష్మీపూర్ జిల్లా సరసన్ గ్రామ నివాసి. అతడి తండ్రి ఓ సాధారణ రైతు. అమెరికాలోని ప్రతిష్టాత్మక కార్నెల్ యూనివర్సిటీకి సెలెక్ట్ అయ్యానని అనురాగ్ సంతోషంగా చెప్పాడు. అక్కడ ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో తన ఉన్నత చదువ అభ్యసిస్తానని తెలిపాడు.
18ఏళ్ల అనురాగ్ తివారి హుమానిటిస్ స్టూడెంట్. మ్యాథ్స్ లో 95 మార్కులు, ఇంగ్లీష్ లో 97 మార్కులు, పొలిటికల్ సైన్స్ లో 99 మార్కులు, హిస్టరీ-ఎకనామిక్స్ లో 100కు 100 మార్కులు స్కోర్ చేశాడు. సోమవారం(జూలై 13,2020) సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ రిజల్ట్స్ విడుదలైన సంగతి తెలిసిందే.
అమెరికాలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం కోసం సాట్(Scholastic Assessment Test-SAT) నిర్వహిస్తారు. ఈ టెస్టులోనూ అనురాగ్ ప్రతిభ చూపాడు. 1370 మార్కులు స్కోర్ చేశాడు. తద్వారా కార్నెల్ యూనివర్సిటీలో సీటు సంపాదించగలిగాడు. 2019లో అనురాగ్ సాట్ రాశాడు.
కంగ్రాట్స్ అనురాగ్:
"అభినందనలు. కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ప్రవేశ ఎంపిక కమిటీ 2020 కోసం కార్నెల్ విశ్వవిద్యాలయానికి మీ ముందస్తు దరఖాస్తును ఆమోదించింది. ఈ అద్భుతమైన వార్తను మీతో పంచుకోవడానికి మరియు కార్నెల్ సంఘానికి మిమ్మల్ని స్వాగతిస్తున్నందుకు నాకు గౌరవంగా ఉంది" అని ఎన్‌రోల్‌మెంట్ కోసం వైస్ ప్రోవోస్ట్ జోనాథన్ ఆర్ బర్డిక్ డిసెంబర్‌లో అనురాగ్‌కు రాసిన లేఖలో తెలిపాడు. అనురాగ్ కి ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం నుండి మరో లేఖ ఇవ్వబడింది. అతనికి పూర్తి స్కాలర్‌షిప్ ఇచ్చింది.
పేద కుటుంబం, వ్యవసాయమే ఆధారం:
ఈ సందర్భంగా తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు అనురాగ్. తన ప్రయాణం అంత సులువుగా సాగలేదని చెప్పాడు. "మాది చాలా పేద కుటుంబం. నాన్న పేరు కమలాపతి తివారి. అమ్మ పేరు సంగీతా తివారి. నాకు ముగ్గురు అక్కలు ఉన్నారు. వారిలో ఇద్దరికి పెళ్లి కావాల్సి ఉంది. వ్యసాయమే మాకు ఆధారం. కుటుంబం మొత్తం దాని మీదే బతుకుతుంది. పంట పండితేనే తిండి దొరుకుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చదువు కోసం గ్రామాన్ని వదిలి సీతాపూర్ లోని రెసిడెన్షియల్ స్కూల్ లో చేరాలని నిర్ణయించాను. కానీ నా తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోలేదు. నేను ఉన్నత చదువుల కోసం వెళితే తిరిగి వ్యవసాయ పనులు చేయడానికి ఊరికి రానని అమ్మ, నాన్న అనుకున్నారు. కానీ మా అక్క. మా అమ్మ, నాన్నలను కన్విన్స్ చేసింది. చదువుకోవడానికి సీతాపూర్ వెళ్లేందుకు ఒప్పించింది" అని అనురాగ్ చెప్పాడు. ఇప్పుడు నేను సాధించిన ఘనత చూసి నా తల్లిదండ్రులు, ఊరి ప్రజలు అంతా చాలా ఆనందంగా ఉంటారని అనురాగ్ ఇంగ్లీష్ లో చెప్పాడు. అనురాగ్, సీతాపూర్ లోని షివ్ నాడార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే విద్యా జ్ఞాన్ లీడర్ షిప్ అకాడమీలో చదివాడు.

0 Comments:
Post a Comment