DGCA Extended International Flights Services Ban: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపధ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు కొనసాగుతోంది. తాజాగా ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు గడువును పొడిగిస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ( DGCA ) ప్రకటించింది. కేవలం హోంశాఖ అనుమతులు ఉన్న సర్వీసులు మాత్రమే కొనసాగుతాయని పౌర విమానయాన శాఖ తెలిపింది. అటు కార్గో విమానాలు, వందేమాతరం మిషన్లో భాగంగా నడుస్తున్న విమానాలకు ఎలాంటి అంతరాయం ఉండదని స్పష్టం చేసింది.
0 comments:
Post a comment