తిరుపతిలోని పలు వార్డులతో పాటు తిరుమలను కూడా కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన చిత్తూరు జిల్లా అధికారులు.. టీటీడీ అధికారుల నుంచి అభ్యంతరాలు రావడంతో దీనిపై వివరణ ఇచ్చారు. తిరుమలని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించిన జిల్లా అధికారులు... ఆ తరువాత తిరుమల మొత్తం కంటైన్మెంట్ జోన్ కాదని తెలిపారు. తిరుమలలోని ఏపీఎస్పీ బ్యారక్ మాత్రమే కంటైన్మెంట్ జోన్ అని వివరణ ఇచ్చారు. ఏపీఎస్పీ బెటాలియన్‌లో ఇద్దరు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో... తిరుమలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించింది కలెక్టర్ కార్యాలయం. దీంతో తిరుమలలో మళ్లీ శ్రీవారి దర్శనాలను నిలిపేస్తారా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. అయితే ఆ తరువాత దీనిపై టీటీడీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో
సవరించిన జాబితాలో తిరుమల పేరును తొలగించింది. దీంతో తిరుమల కంటైన్మెంట్ జోన్ అనే వివాదానికి తెరపడింది.
0 Comments:
Post a Comment