అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల నిర్వహణకే పెద్ద పీట వేస్తూ వస్తోన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ మరో కొత్త పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ఏపీలోని చిరు/వీధి వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు జగనన్న తోడు అనే పథకాన్ని ఏపీ ప్రభుత్వం అక్టోబర్‌లో ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి, సంప్రదాయ వృత్తులు చేసే హస్త కళాకారులకు రూ.10వేల వరకు వడ్డీ లేని రుణాన్ని ఇవ్వనున్నారు. ఆ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరించనుంది. ఈ క్రమంలో అర్హుల గుర్తింపు కోసం ఈ నెల 6 నుంచి 13 వరకు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు సర్వే నిర్వహించనున్నారు. 16వ తేదీ నుంచి 23 వరకు గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితాను ప్రదర్శించనున్నారు.
వీరికి అక్టోబర్‌లో ప్రభుత్వం పది వేల సాయాన్ని అందించనుంది.
వీరికి అక్టోబర్‌లో ప్రభుత్వం పది వేల సాయాన్ని అందించనుంది.
0 Comments:
Post a Comment