కరోనా మహమ్మారి దేశంలో వేగంగా విస్తరిస్తోంది. బయటకు వెళ్ళాలి అంటే ప్రజలు భయపడుతున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే సోషల్ డిస్ట్రెన్స్ తో పాటు బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి చేసింది. దీంతో ప్రపంచంలో మాస్క్ లకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే, చాలామంది మెడికేటెడ్, ఎయిర్ ఫిల్టరేషన్ చేసే వాల్వ్ మాస్కులను కొనుగోలు చేసి ధరిస్తున్నారు.
ఇలాంటి వాల్వ్ మాస్కులు సురక్షితం కాదని, కరోనా వైరస్ అడ్డుకోలేవని అంటున్నారు ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోబోటిక్ సర్జరీ డైరెక్టర్ అరవింద్ కుమార్ గారు. వాల్వ్ మాస్కులు బయటనుంచి అచ్చే గాలిని ప్యూరిఫై చేస్తాయి. అయితే, బ్రీత్ ఔట్ చేసినపుడు ఆ వాల్వ్ ల నుంచి గాలి ఫోర్స్ గా బయటకు వెళ్తుంది.
బ్రీత్ ఔట్ చేసిన గాలిని వాల్వ్ లు ప్యూరిఫై చేయవు. కరోనా రోగులు ఎవరైనా ఇలాంటి వాల్వ్ మాస్కులు ధరించి బయటకు వస్తే, ఉశ్చ్వాస క్రియ ద్వారా గాలితో పాటుగా కరోనా బయటకు వస్తుంది. ఫలితంగా వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులకు కరోనా సోకె ప్రమాదం ఉందని అంటున్నారు. వాల్వ్ మాస్కుల కంటే గుడ్డతో చేసిన మాస్కులు బెటర్ అని చెప్తున్నారు. రెండు మూడు లేయర్లు కలిగిన గుడ్డతో తయారు చేసిన మాస్కులను ధరిస్తే, బ్రీత్ ఔట్ గాలి బటయకువెళ్లినా, కరోనా వైరస్ మాస్క్ గుడ్డను దాటి బయటకు వెళ్లలేదని అరవింద్ కుమార్ గారు పేర్కొన్నారు. వాల్వ్ ఉన్న మాస్కులు పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయిగాని, కరోనా వైరస్ ను కంట్రోల్ చేయలేవని, గుడ్డతో తయారు చేసిన మాస్కులు వాడటం ఉత్తమం అని అయన తెలిపారు.

0 Comments:
Post a Comment