ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తున్న కరోనా మహమ్మారికి.. హెటిరో ఫార్మా కంపెనీ ఇంజెక్షన్ ని తయారు చేసింది. కోవిడ్-19 పోరాటంలో భాగంగా రెమ్‌డిసివిర్ ని ఉత్పత్తి చేసింది. ఇప్పటికే కోవిడ్ చికిత్సకు ఈ మందును వాడవచ్చని కేంద్ర ప్రభుత్వం కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. అందులోనూ ప్రస్తుతం ప్రపంచంలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా పెరుగుతుండటంతో.. ఈ యాంటీ వైరల్ డ్రగ్ కు డిమాండ్ బాగా పెరిగింది. ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆ ఇంజెక్షన్ మందు కోసం భారీ స్థాయిలో బ్లాక్ మార్కెట్ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) వార్నింగ్ ఇచ్చింది.
అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది.
ఎమ్మార్పీ కన్నా ఎక్కువ రేటుకు రెమ్‌డిసివిర్ మందును అమ్మకుండా చూడాలని పేర్కొంది. కొందరు ఆ డ్రగ్‌ను బ్లాక్ మార్కెట్లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని డీజీసీఐ వెల్లడించింది. యూపీ నుంచి తమకు ఈ అంశంపై ఫిర్యాదులు అందినట్లు డీజీసీఐ చీఫ్ డాక్టర్ వీజీ సోమని తెలిపారు. ఇక అలాగే రెమ్‌డిసివిర్‌కు చెందిన జనరిక్ మందును ఉత్పత్తి చేయనున్నట్లు మిలాన్ ఎన్‌వీ డ్రగ్ సంస్థ వెల్లడించింది. డేస్రమ్ పేరుతో జనరిక్ వర్షన్ రిలీజ్‌కు డీజీసీఐ అంగీకరించింది. సిప్రెమి పేరుతో సిప్లా 100 మిల్లీ గ్రాముల మందును ఐదు వేల రూపాయలకు అమ్మనున్నది. కోవిఫర్‌ను హెటిరో సంస్థ రూ.5,400లకు అమ్మనున్నది.
0 Comments:
Post a Comment