Internet Desk: BJP senior leader Subramanya Swamy has said that he strongly believes that young actor Sushant Singh Rajput was murdered. He also revealed the evidence to suggest so through social media today.
ఇంటర్నెట్ డెస్క్: యువనటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పూత్‌ది హత్య అని తాను గట్టిగా నమ్ముతున్నట్టు భాజపా సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి ప్రకటించారు. అలా భావించేందుకు ఆధారాలను కూడా ఆయన నేడు సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. సుశాంత్ సింగ్ బాంద్రాలో ఉన్న తన నివాసంలో జూన్ 14న మృతి చెందిన సంగతి తెలిసిందే. అనంతరం వెలువడిన పోస్ట్‌మార్టం నివేదికలో కూడా నటుడు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియవచ్చింది. సంచలనం సృష్టించిన ఈ వ్యవహారంలో సీబీఐ విచారణ సాధ్యంకాదని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వామి స్పందిస్తూ.. వరుస ట్వీట్లు చేశారు.
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ముంబయి మూవీ మాఫియా పనిచేస్తోందని..
ఈ క్రమంలో ఓ నటిని బలి చేసేందుకు రంగం సిద్ధమయిందని ఆయన అన్నారు. ''సుశాంత్ సింగ్ రాజ్‌పూత్ హత్య గురైయ్యాడని నేను ఎందుకు అనుకుంటున్నానంటే...'' అంటూ ఆయన చేసిన మరో ట్వీట్లో 26 అంశాలతో కూడిన ఓ పత్రాన్ని షేర్ చేశారు. దానిలో ఆయన శరీరంపై ఎవరో కొట్టిన ఆనవాళ్లు ఉన్నట్టుగా ఉంది. అంతేకాకుండా సుశాంత్ మెడపై చిహ్నాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో సుశాంత్ మరణంపై సీబీఐ విచారణకు ఆదేశించాల్సిందిగా బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సుబ్రహ్మణ్య స్వామి బుధవారం కోరారు. గతంలో ప్రధాని మోదీకి రాసిన లేఖలో కూడా యువనటుడి మరణంతో కొందరు బాలీవుడ్ పెద్దలకు సంబంధం ఉందని.. వారు ఈ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించాలంటూ ముంబయి పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా సుశాంత్ తండ్రి కేకే సింగ్ సుశాంత్ స్నేహితురాలు, నటి రియా చక్రవర్తిపై పట్నా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసు విచారణ కొనసాగుతోంది.

0 comments:
Post a comment